- 2 టౌన్ పోలీస్ స్టేషన్ శంకుస్థాపనకు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు నుంచి ప్రయాణం చేయరా?
- పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి శంకుస్థాపనకు అడ్డదారుల్లో ప్రయాణం ఎందుకో ప్రధాన రహదారుల్లో
- నియోజకవర్గంలో ప్రధాన రోడ్లన్నీ గోతులేనని తెలిసి పోతుందనా ?
విజయవాడ, (జనస్వరం) : వన్ టౌన్, కాళేశ్వర మార్కెట్, కెటి రోడ్డు మీదుగా పాల ఫ్యాక్టరీ వెళ్లే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పనితనం ఏంటో అభివృద్ధి ఏంటో తెలిసేది అని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ అన్నారు. మంత్రులు సుచరిత, పెద్దిరెడ్డి, నాని లను దయచేసి వన్ టౌన్ కాళేశ్వర రావు మార్కెట్ నుంచి కెటి రోడ్డు మీదుగా పాల ఫ్యాక్టరీ వెళ్లాలని అభ్యర్దించారు. ముక్కు చూపించమంటే చేయి పెట్టి చుట్టూ తిప్పి చూపించినట్టు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీరు మీకు అర్ధం అయ్యేదని తెలియజేశారు. పశ్చిమంలో ప్రధాన రహదారులన్నీ గోతులుమయంగా మారిందని, ప్రజలు మాత్రం ఇబ్బంది పడాలి, గోతులు పడ్డ రోడ్లపై నిత్యం ప్రయాణం చేయాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు సాఫీగా ఉన్న రోడ్లపై ప్రయాణం చేయాలా..? ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. పశ్చిమంలో మేయర్ 19 కార్పొరేటర్లు ఉన్న ప్రజలకు ఒరిగింది మాత్రం శూన్యమని అన్నారు. గోతులు పడ్డ రోడ్లు, కొండలపై నుంచి జారిపడే బండరాళ్లు మాత్రమే ఒక్కసారి ఇంఛార్జ్ మంత్రి, నాని, పశ్చిమ నియోజకవర్గం మొత్తం పరిశీలించాలని కోరారు. కాదేదీ కబ్దాకనర్హం అదే మంత్రి వెల్లంపల్లి తీరు ఉందని అన్నారు. వెల్లంపల్లి ఫౌండేషన్ పేరుతో ఇరిగేషన్ స్థలాన్ని, పురావస్తుశాఖ స్థలాన్ని, కార్పొరేషన్ స్థలాన్ని కబ్జా చేసిన మూడు ప్రాంతాలను కూడా మీరు పరిశీలించాలని పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరఫున కోరారు. ప్రజలు క్రమం తప్పకుండా పన్నులు కట్టాలి జనసేన నాయకులు శ్రమదానం చేయాలి. వైసీపీకి ఓటు వేయడం ప్రజల పాపమా? అని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com