Logo
Date of Publish : 01 January 2022, 9:03 am
Editor : Sake Naresh

రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే సినిమా టిక్కెట్లుపై ఏకాగ్రత ఎందుకు? రైల్వేకోడూరు జనసేన నాయకులు గంధంశెట్టి దినకర్ బాబు

     రైల్వేకోడూరు, (జనస్వరం) : కడప జిల్లా రైల్వేకోడూరు జనసేనపార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సమస్యలు రాష్ట్ర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా... వైసీపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల పైన ఏకాగ్రత ఏర్పరుచుకోవడం దురదృష్టకరమైన విషయమని రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు విమర్శించారు. ప్రభుత్వం రాష్ట్ర సమస్యలైన రాజధాని, పోలవరం, నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు, నిరుద్యోగ సమస్య మొదలగు అనేక సమస్యలు ఉన్నా... వీటన్నిటినీ కాదని ఏ మాత్రం ఉపయోగం లేని సినిమా టికెట్లు రేట్లు తగ్గించడం సమంజసం కాదన్నారు. పులివెందులలో ఆక్వా హబ్ ఏర్పరచడం సంతోషదాయకమైననూ, మొదటి నుండి వై.ఎస్.ఆర్ కుటుంబానికి వెన్నుదన్నుగా ఉన్న రైల్వేకోడూరు నియోజకవర్గానికి వైసీపీ ప్రభుత్వం ఏమి చేయకపోవడం అన్యాయమన్నారు. నాలుగు పర్యాయాలు శాసన సభ్యునిగా ఎన్నికైన ప్రస్తుత విప్ అయిన కొరముట్ల శ్రీనివాసులు అసెంబ్లీ సమావేశాలలో కనీసం రైల్వేకోడూరు సమస్యలపైన ఒక్కసారైనా స్పందించడం ప్రజలు చూడలేదన్నారు. ఒకవేళ ఆయన స్పందించి తెచ్చిన ఏ ఒక్క అభివృద్ధి పథకం ఏ మాత్రం ఈ ప్రాంతంలో కనిపించడం లేదన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు, రోడ్లపై గుంతలు నాసిరకంగా పూడ్చడం తప్ప ఇంకా ఏమీ చేయలేదని, అవి కూడా సరైన పద్ధతిలో పూర్తి చేయలేదన్నారు. కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు, సిమెంట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. PMGAY పథకం కింద గత రెండేళ్లలో ఒక్క ఇల్లు నిర్మించి లేని వైసీపీ ప్రభుత్వం ఓటిఎస్ పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు అని ఆరోపించారు. కనీసం మిగిలిన రెండున్నర సంవత్సర కాలంలో నైనా ప్రభుత్వం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆశిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో హరి, అనంత రాయలు, మాదం సుబ్రహ్మణ్యం, మధు, మణి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com