Search
Close this search box.
Search
Close this search box.

దిశ చట్టం సుగాలీ ప్రీతి కేసుకి న్యాయం ఎందుకు చేయలేకపోతుంది ?

దిశ చట్టం సుగాలీ ప్రీతి కేసుకి న్యాయం ఎందుకు చేయలేకపోతుంది ?

ఓ అబల ప్రాణం… 

ఓ తల్లి పోరాటం… 

ఓ ప్రభుత్వ నిర్లక్ష్యం… 

ఒక తల్లి అలుపెరగని, అలసిపోని పోరాటం – దిశా చట్టం చేసేశాం అని చెప్పినా   ఇంకా న్యాయం అందని ద్రాక్షేనా !!! 

అసలు ఎం జరిగింది? : 

      2017 ఆగష్టు 19 న, కర్నూలు కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్సియల్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న ఒక బాలిక  అనారోగ్యంగా ఉందని తల్లి తండ్రులకు ఫోన్ రావడంతో స్కూల్ కి  వెళ్లి చూడగా స్కూలు  చుట్టూ పోలీసులు, ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఉన్న కూతురిని చూసి తండ్రికి మాట రాలేని పరిస్థితి, జరిగిన విషయం భార్యకు చెబితే, వికలాంగురాలు  భార్ కు ఏమి అవుతుందో అనే భయం ఒక వైపు.  పోలీసుల సమాచారం ప్రకారం ఫీజు కట్టలేదని మేనేజ్ మెంట్  ప్రశ్నించేసరికి  ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కానీ తరచూ ఫీజు కట్టే తల్లితండ్రులకు ఇది నమ్మకం కలగక మరియు  ప్రత్యక్ష పరిస్థితులు, జరిగిన తీరు చూసి, ఇది ఖచ్చితంగా హత్యేనని  ఆత్మహత్య కాదని తల్లితండ్రులు బలంగా నమ్మారు. ఈ వార్త వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో, విద్యార్ధి సంఘాలు, పలు కుల సంఘాలు ఏకమై ఉద్యమించడంతో నిజ నిర్దారణ కమిటీ ఏర్పడి విచారించగా, వెలుగులోకి వచ్చిన విశేషాలు ఇవి.  

             చాలా ఆధారాలు సేకరించి, 19 ఆగష్టు 2017 అర్థరాత్రి అమ్మాయిని మానభంగం చేసి హత్య చేసారని నిర్ధారించడం జరిగింది. ముందుగా హత్యచేసి భౌతికకాయాన్ని ఎలా భద్రపరిచారో తెలియదు. కానీ, ఉదయం 7 గంటల ముందు మాత్రం హత్యాస్థలం(డ్రెస్సింగ్ రూమ్) లో ఉంచలేదు. ఎందుకంటే, అప్పటికే మిగిలిన వారు యధావిధిగా పాఠశాలకు వాళ్ళు తయారు అవుతూ ఉంటారు కాబట్టి.  వాళ్ళు ఉంటే ఆత్మ హత్య ఐతే వాళ్ళు నివారించేవారు కాబట్టి. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నాలు వాస్తవాలు గమనిస్తే చాల తేలికగా నిజాలు బయటపడతాయి.  అందుకేనేమో ఈ కేసును మన మీడియా కూడా ప్రజల కు దూరంగా ఉంచింది.  కేవలం 5 అడుగులు ఉన్న ఒక అమ్మాయి 10.4 అడుగులు ఎత్తులో ఉన్న ఫ్యానుకు ఉరి ఎలా వేసుకుంటుంది అది కూడా  చీర అవతలి అంచు ఒక ముడి, మెడకు ఒక ముడి వేసుకుని. ఫ్యాను రెక్కకు ముడి వేయడానికి సహకరించే నిచ్చెన కానీ, బల్ల కానీ ఏమి లేవు ఆ పరిసరాలలో.  55 కిలోల బరువు ఉన్న ఆమె ఉరి వేసుకుంటే కనీసం ఫ్యాను రెక్క ఒకవైపుకు వంగాలి , కానీ అది జరగలేదు, కేవలం నిలబడటానికి మాత్రమే సహకరించే విధంగా ఉంది. పోలీసులకు అక్కడ దొరికిన సామాగ్రి కేవలం చీర, ఒక్క అడుగు బకెట్ మాత్రమే. కేవలం ఇది వేరొక వ్యక్తి ఉరి వేసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం మాత్రమే. లిగేచూర్ మార్కులు దాదాపు లోతుకు చొచ్చుకు ఉండి, చీరతో మ్యాచ్ అవ్వకపోవడం కూడా ఈ హత్యకు బలం చేకూర్చే అంశం. దాదాపు మూడు గంటల పాటు పోస్టుమార్టం చేసిన డాక్టర్లు ఇచ్చిన నివేదిక ప్రకారం, ఆమె శరీరం పై పలు గాయాలు, మర్మాంగం వీర్యంతో నిండి ఉండటం ఇవన్నీ కేవలం హత్య మాత్రమే కాదు మానభంగం చేసి హత్య చేశారనే దానికి బలం చేకూరుస్తున్నాయి. దీన్ని ధ్రువీకరించడానికి పాథాలజీ రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది, దానిలో కూడా వీర్యం తాలూకు నమూనాలు ఉన్నాయి అని నిర్దారించారు. పోలీసులు తీవ్ర ఒత్తిడి తెచ్చిన  సరే తల్లితండ్రులు పట్టు వదలకుండా  ప్రజా సంఘాలు, తల్లితండ్రుల అలుపెరగని పోరాటానికి కలెక్టర్ గారు  కమిటీ వేస్తే ఇది మానభంగం మరియు హత్య అని రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఇక్కడ నిందితులు సామాన్యులు కాదు ఎన్కౌంటర్ లో లేపేయడానికి, స్కూళ్ళు, హోటళ్ళు, మొదలైన వ్యాపారాలు నడిపి రాజకీయ బలం ఉన్నటు వంటి ఉన్నత వర్గం. హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ లాబరేటరీలో వాళ్ళ బలం ప్రయోగించి బాలిక మర్మాంగంలో వీర్యం తాలూకు  నమూనాలు ఏమి లేవని ఒక నివేదిక ఇప్పించుకుని కేసు నుండి చాలా తేలికగా తప్పించుకున్నారు. 

          ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎందుకు ఒక తల్లి ఆవేదనను అర్ధం చేసుకోలేక పోతున్నారు.  ఇది ఒక తెలుగుదేశం పార్టీ అధికారం లో ఉన్నప్పుడు జరిగింది. ఒక తెలుగుదేశం నాయకుడికి నిందితుడు కి సంబంధాలు ఉండటంతో అప్పటి ప్రభుత్వం కాపాడింది, కానీ అప్పటి ప్రతి పక్షము కూడా స్పందించలేదు దీనిపై.  ఇప్పుడున్న వైస్సార్సీపీ పార్టీ ప్రభుత్వానికి కూడా చాలా  విన్నపాలు చేసుకున్నా సరే ఎవ్వరు సరిగ్గా స్పందించటం లేదు. అక్టోబర్ 2019లో జనసేన అధ్యక్షుడిని కలిసి వాళ్ళ ఆవేదనను చెప్పాక, పవన్ కళ్యాణ్  చెప్పింది ఒకటే మాట “విన్న నాకే మాట రావట్లేదు, ఇన్నాళ్లు ఎందుకు ఎవ్వరూ  న్యాయం చేయలేకపోయారు. తను  ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తానని మాటిచ్చారు”. పలుమార్లు అసెంబ్లీ లో చర్చించమని కోరినా దీని మీద పాలక పక్షం, ప్రతిపక్షం రెండూ మౌనం పాటించడమే కాకుండా, ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మానభంగం ఉదంతం పైన చర్చ జరిపి అక్కడ నిందుతులని శిక్షిస్తే సెల్యూట్ చేసి, బాధితురాలి పేరు పై చట్టం చేసి కేవలం 21 రోజులలో ఆడవాళ్ళపై దౌర్జన్యానికి పాల్పడితే శిక్షిస్తాము అని చెప్పారు కానీ, ముఖ్యమంత్రి తన ప్రాంత అమ్మాయి అయినటువంటి సుగాలి ప్రీతీ కి జరిగిన అన్యాయానికి నిందుతులను శిక్షించడానికి వచ్చే అడ్డంకులు ఏమిటో?

                       ఫిబ్రవరి 2020 లో పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతీ కేసు ను సిబిఐ కి అప్పగించాలని భారీ ర్యాలీ నిర్వహిస్తే, ప్రజల్లో వచ్చిన అనూహ్య స్పందనకు, తరువాత  బాధితురాలి తల్లి ముఖ్యమంత్రిని కలిసి చేసి విన్నపానికి  స్పందించి కేసు ని సిబిఐ కి అప్పగిస్తున్నామని చెప్పారు. కానీ ఇది జరిగి కొన్ని నెలలు గడుస్తున్నా ఇంకా సిబిఐ వారు కేసు ని విచారణ చేపట్ట లేదు. ఇప్పటికి కేసు విచారణలో జాప్యం జరుగుతుంది కానీ బాధితుల తల్లితండ్రులని  భయపెట్టడం లో మాత్రం కాదు. కేసును ఉపసంహరించుకోమని స్వయంగా ప్రభుత్వ అధికారులే రాయభారం నడుపుతున్నారంటే నిందితులు ఎంతటి వారో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రజలందరికి నిజాలు తెలియడం మొదలు అయ్యాక, నిందుతులు మరో మార్గం లో కేసును ప్రక్కదోవ పట్టించడానికి ఎత్తులు వేస్తున్నారు.  మహిళా జర్నలిస్ట్ అంటూ కొంత మందిని దింపి భాదితులనే నిందితులుగా చిత్రీకరించే ప్రయత్నం మొదలు పెట్టారు.   ఇది ఒక తల్లి ఆవేదనగా తాను  మాత్రమే చేసే పోరాటంగా అయితే మాత్రం ఇక్కడ న్యాయం జరగడం కష్టం. ప్రజలందరూ ఏకమై, కుల, మత, ప్రాంత బేధం లేకుండా పోరాడవలసిన సమయం  వచ్చింది. ఆ తల్లికే కాదు యావత్ మానవ సమాజానికి ఐక్యమత్యంతో ఉంటే  ఏదైనా సాధించవచ్చు.  అనేది తెలియ చెప్పే సమయం వచ్చింది. ఇది మనకి జరిగింది కాదు కదా అని మనం ఇప్పుడు అనుకుంటే, ఈ వ్యవస్థ మనం మానవ సమాజాన్నే  తినేసే ప్రమాదం ఉంది.  కేవలం డబ్బుండి , రాజకీయ పలుకుబడి ఉంటే , తప్పు చేసి తప్పించుకోవచ్చు అనేది ఒక నిత్యసత్యంగా మారే  ప్రమాదం కూడా ఉంది. 

                ఈరోజుతో తన కుమార్తె చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది, అయినా తనకు న్యాయం జరగక ఆ తల్లి పడే ఆవేదన వర్ణనాతీతం. ఏ తప్పు చెయ్యని ఆ తల్లి తండ్రులు తిండి నిద్ర మానేసి రోజూ న్యాయం కోసం, తన కూతురు మరణానికి న్యాయం  జరుతుందనే నిరీక్షణలో నే బ్రతికేస్తున్న అలుపెరగని పోరాట యోధులు.  కానీ ఒకవైపు తప్పు చేసి , హాయిగా వాళ్ళ జీవితాలను అనుభవిస్తు,న్న నిందితులు, ఈ కేసు ను తప్పు దోవ పట్టించేటందుకు సాయం చేసిన అధికారులు వాళ్ళ విలాస జీవితం లో మాత్రం జీవిస్తూనే ఉన్నారు. 

          కేవలం చట్టాలు చేసిఅభినందన భజన చేసుకోవడానికి మాత్రమేనా? పక్క రాష్ట్రం లో జరిగిన ఉదంతం ఉదాహరణగా  చెప్పి ఒక్క చట్టం చేసి , తీరా దోషులని రక్షిస్తూ సమాజానికి చెప్పే జవాబు ఏమిటి?

                                                                                                          by 

వెంకటదుర్గ ప్రసాద్ 

ట్విట్టర్ ఐడి : @Ndpkakinada

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way