విజయవాడ ( జనస్వరం ) : ఇంటింటికి రాబోయే జనసేన ప్రభుత్వం రెండో విడతలో భాగంగా 53 వ రోజు 46 వ డివిజన్ అధ్యక్షులు షేక్ షర్మిల అమీర్ భాష ఆధ్వర్యంలో నాగమ సత్రం ఎదురు సందు భీమన్న వారి పేట వద్ద నుండి ప్రారంభించారు. కొండ ప్రాంతంలో పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొండ ప్రాంతంలో ఎక్కడ చూసినా కుడా సమస్యలు చెప్తున్నారని మిల్క్ ప్రాజెక్టు దగ్గర రిక్వెస్ట్ బస్ స్టాప్ లేదు, కరెంటు స్తంభాలు విరిగిపోయాయి, వీధి దీపాలు సరిగా వెలగడం లేదని చెప్తున్నారని అదేవిధంగా మేయర్ గారికి ఏదైనా సమస్య చెప్పుకుందాం అని వెళ్తే మేయర్ గారు మేయరు గారి భర్త మీరు కట్టే పన్ను ఎంత మీరు అడిగే పని ఏంటి అని మాట్లాడుతున్నారు అని అన్నారు. అదేవిధంగా రిటైనింగ్ వాల్స్ నిర్మాణాల మీద మీరు ఎందుకు దృష్టి పెట్టడం లేదని, కొండ పై భాగంలో వాటర్ ట్యాంక్ నిర్మాణంలో ఆ కాంట్రాక్టర్ ఎవరు ఆ కాంట్రాక్టర్ మేయర్ గారి బినామీన లేక మేయర్ గారి భర్త బినామీన నాలుగు కోట్ల రూపాయల అంచనా ఉన్న ఆ వాటర్ ట్యాంక్ నిర్మాణం మీద అంత ప్రత్యేక దృష్టి ఎందుకు పెట్టారని డివిజన్ లోని సమస్యల మీద మీకు శ్రద్ధ లేదుగానీ వాటర్ ట్యాంక్ నిర్మాణం మీద అంత ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. అతను మీ బినామి కాంట్రాక్టర్ అయి వుంటాడని మీకు ఆ కాంట్రాక్ట్ లో 20% లేక 25% కమిషన్ వస్తుంది గనుకనే మీరు అక్కడ యానాదులు తమ సొంత రెక్కల కష్టంతో నిర్మించుకున్నటువంటి షెడ్డును కూడా కూలగొట్టారని మీకు 70 లక్షలో 80 లక్షలో కమిషన్ వస్తే యానాదుల జీవితాలన్ని అస్తవ్యస్తం చేస్తారని అన్నారు.
మాట మాటకి జగన్ మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటున్నారని కానీ స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాత్రం నా కార్పొరేషన్ స్థలాలు నా ఇరిగేషన్ స్థలాలు నా పురావస్తు స్థలాలు అని చెప్పి కొట్టేస్తున్నాడా అని దానికి మేయర్ గారు వత్తాసు పలుకుతున్నారా సమాధానం చెప్పాలని అన్నారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రభుత్వ స్థలాలును కొట్టేయడం ఆ స్థలాలకి ట్రస్ట్ పేర్లు పెట్టడం మేయర్ గారు వెళ్లి వాటిని ఓపెన్ చేయడం మీరు అధికారంలో ఉంది ప్రభుత్వ స్థలాలు కాపాడడానికా లేక ప్రభుత్వ స్థలాలను కొట్టేయడానికా గత 3నెలలుగా పశ్చిమ నియోజకవర్గ లో మంచి నీరు సరిగా రావడం లేదని అన్నారు. కలుషిత నీరు వస్తుందని చాలామంది రోగాల బారిన పడుతున్నారని ఈ సమస్యల్ని పరిష్కరించడం మాత్రం చేతకాదని కానీ మీ అక్రమ నిర్మాణాలకి సైకిల్ కాంట్రాక్టులకి క ఏజెంట్లను మాత్రం బాగానే పెట్టుకున్నారని కానీ మీరు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలని ప్రజా సమస్యల మీద మీరు దృష్టి పెట్టక పోతే నగర ప్రథమ పౌరురాలుగా మీకు మీ వార్డు మీదే చిత్తశుద్ధి లేదని అన్నారు. మీ డివిజన్లోనే సమస్యలను పరిష్కరించడం లేదని స్థానిక ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారనీ, యానాదుల సమస్యల్ని పరిష్కరించడంలో రాజకీయం చేస్తే ఊరుకోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపిశెట్టి వెంకన్న , బెవర లోకేష్, బుద్ధన ప్రసాద్, శిరాం శీను బాబు, కరీముల్లా, వడ్డాది రాజేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com