Logo
Date of Publish : 07 September 2021, 4:24 pm
Editor : Sake Naresh

వైసీపీ వాళ్ళ ఊరేగింపులకు లేని నిబంధనలు వినాయక చవితి వేడుకలకు ఎందుకు? ప్రకాశం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్‌ రియాజ్‌

    ఒంగోలు, (జనస్వరం) : వినాయక చవితి పర్వదిన వేడుకలపై వైసీపీ ప్రభుత్వం విధించిన నిబంధనలు భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని ప్రకాశం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్‌ రియాజ్‌ గారు ఆరోపించారు. ఇళ్లకే పరిమితం చేసుకోవాలని చెబుతూ, ఇందుకు కోవిడ్‌ నిబంధనలను కారణంగా చూపిస్తున్నారు. కోవిడ్‌ ప్రోటోకాల్‌ను నూటికి నూరు శాతం అమలు చేసిన పక్షంలో ఇలాంటి ఉత్తర్వులు ఇస్తే ఎవరైనా ఒప్పుకొంటారు. వైసీపీ వాళ్ళు తమ నేతల పుట్టినరోజు వేడుకలను నడివీధుల్లో  చేసుకొని నిబంధనలు ఉల్లంఘించలేదా?  ఊరు పేరు లేని పదవి తెచ్చుకొన్నవాళ్లకి ఊరేగింపులు తీసి స్వాగతాలు పలికినప్పుడు కోవిడ్‌ ప్రబలలేదా?వర్ధంతులకు గుంపులు గుంపులుగా వెళ్ళి దండలు వేయలేదా?  ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి గారు ఇడుపులపాయలో సమాధి దగ్గర ఏమైనా సోషల్‌ డిస్టెన్స్‌ పాటించారా? మాస్క్‌ కూడా పెట్టుకొని ముఖ్యమంత్రి ఆయన. అలాంటి సీఎం నేతృత్వంలోని ప్రభుత్వం వినాయక చవితిని నిలుపుదల చేసేందుకు కోవిడ్‌ ప్రోటోకాల్‌ను చెప్పడం విచిత్రంగా ఉంది. వినాయక చవితి నవరాత్రులను చలువ పందిళ్ళు వేసి నిర్వహించుకోవడం ద్వారా సమాజంలో ఐకమత్యం పెరుగుతుంది. సోదర భావం ఏర్పడుతుందనే వాస్తవాన్నిచరిత్ర చెబుతోంది. తెలియని ఈ పాలకులు ఒకసారి స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ బాల గంగాధర్‌ తిలక్‌ చరిత్ర చదివితే మంచిదని రియాజ్‌ గారు  అభిప్రాయపడ్డారు. వినాయకచవితి వేడుకలను అడ్డుకోవడానికి  ప్రభుత్వం చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవు. ప్రజలు మాస్క్‌ పెట్టుకొని, సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ, శానిటైజర్‌ రాసుకొని పూజలు చేసుకోవచ్చు అని అనుమతులు ఇస్తే భక్తులకు ఒక వెసులుబాటు ఉంటుంది. అపార్ట్మెంట్స్ లో కూడా చేసుకోరాదు  అని చెప్పడం ద్వారా లౌకిక స్ఫూర్తిని వైసీపీ ప్రభుత్వం దెబ్బ తీసింది. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com