పిడుగురాళ్ల పట్టణం, (జనస్వరం) : పిడుగురాళ్ల పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాల గురించి ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి మండపాలకు కరోనా సాకుగా చూపించి అనుమతులు నిరాకరించడాన్ని తప్పుబట్టారు. మందు షాపులు వద్ద, రెస్టారెంట్లు వద్ద, సినిమా థియేటర్ల వద్ద, అధికార పార్టీ నాయకుల సభల్లో ర్యాలీల్లో వందల మంది ఉన్న రాని కరోన వినాయక మండపాల వద్ద మాత్రమే వస్తుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గుంటూరులో వినాయకుని విగ్రహాలని మున్సిపాలిటీ ట్రక్కులో తీసుకెళ్లడం హిందువుల భక్తి విశ్వాసాలు, వారి మనోభా వాలు ఈ వైసిపి ప్రభుత్వంలో మంట కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు ఇచ్చినట్లుగానే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి మండపాలకు వెంటనే అనుమతులు ఇవ్వాలని, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తమ యొక్క నిర్ణయాన్ని మార్చుకుని వినాయక చవితి వేడుకలకు అనుమతులు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కామిశెట్టి రమేష్, దూదేకుల కాసిం సైదా, పెదకొలిమి కిరణ్ కుమార్, దూదేకుల శ్రీను, షేక్ మదీనా, షేక్ గఫూర్, తుమ్మలపూడి వెంకటకృష్ణ, భయ్యవరపు రమేష్, కామిశెట్టి అశోక్, కొమ్మిశెట్టి సతీష్, తోట అంజి, యతిరాజుల కొండ, అడపా వెంకట్, తదితరులు పాల్గొన్నారు.