ఎమ్మిగనూరు ( జనస్వరం ) : ఎన్నికల్లో ఓట్ల కోసం హడావిడి చేస్తూ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసిన పాలకులు ఎక్కడున్నారని ప్రజల సమస్యలు పరిష్కరించలేని పదవులు అవసరమా అని ఎమ్మిగనూరు జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ అధికారపార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గోనెగండ్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జనంలోకి జనసేన కార్యక్రమంలో పలు విధుల్లో పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్నా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేఖగౌడ్ మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని మేజర్ గ్రామ పంచాయితీ పరిధిలో కొన్ని విధుల్లో ఇప్పటికి ప్రజలు ముళ్లపొదల మధ్య జీవనం సాగిస్తున్నారని ప్రజలకు నెరవేర్చాలేని హామీలు ఇస్తూ మోసం చేస్తున్న నాయకులు ఉన్నంత వరకు అభివృద్ధి చెందేది నాయకుల ఆస్తులు మాత్రమేనని ప్రజలు మాత్రం ఎక్కడి సమస్యలు అక్కడే నిలిచి మోసపోతూన్నారని అన్నారు. విష సర్పాల భారిన పడి పాముకాటుకు గురైన వారు ఎందరో సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. చదువుల రామయ్య, వివర్స్ కాలని, మైనారిటీ కాలని, ప్రజలు కనీస సౌకర్యాలు లేని పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు అభివృద్ధికి నోచుకోలేక ఆగ్రహంతో ఉన్నారని వారి జీవనం అరణ్యమో స్మశానమో అన్న చందంగా తయారైందని అధికారపార్టీ చేస్తున్న గడప గడప కార్యక్రమంలో ప్రజలు నాయకులను నిలదిస్తున్న తీరే సాక్ష్యమని అన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజి, త్రాగునీటి, సమస్యలు అధికంగా ఉన్నాయని పంచాయితి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని లేనిచో ప్రజల సహకారంతో జనసేన పార్టీ పోరాటాన్ని ఉదృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గానిగ బాషా, మాలిక్, ఖాసీం సాహెబ్,మాబాష, రామంజి, భాస్కర్,అలీ బాషా,దూద్ పిరా, ఇస్మాయిల్, మధు,వెంకటేష్, నబి రసూల్, ఫారూక్, మునాఫ్,హనుమంతు, సాధిక్ పాల్గొన్నారు.