పాడేరు ( జనస్వరం ) : జనసేన పార్టీ పాడేరు మండల అధ్యక్షులు నందొలి మురళికృష్ణ మాట్లాడుతూ ఎన్నికల్లో ఓట్ల కోసం హడావిడి చేస్తూ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసిన ప్రజా ప్రతినిధులు ఎక్కడున్నారని, ప్రజల సమస్యలు పరిష్కరించలేని పదవులు అవసరమా అని అని తక్షణమే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపన చెప్పలని అన్నారు. ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడేరు మండల కేంద్రములో మినుములురు గ్రామంలో జనసైనికులు పర్యటించారు. అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని మేజర్ గ్రామ పంచయతీ పరిధిలో కొన్ని విధుల్లో ఇప్పటికీ ప్రజలు ముళ్ళపొదల మధ్య జీవనం సాగిస్తున్నారని ప్రజలకు నెరవేర్చాలేని హామీలు ఇస్తూ, మోసం చేస్తున్న నాయకులు ఉన్నంత వరకు అభివృద్ధి చెందేది నాయకుల ఆస్తులు మాత్రమేనని ప్రజలు మాత్రం ఎక్కడి సమస్యలు అక్కడే నిలిచి మోసపోతూన్నారని అన్నారు. విష సర్ఫాల బారిన పడి పాముకాటుకు గురైన వారు, ఎందరో సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మినుములురు గ్రామంలో వైసీపీ పార్టీ గడప గడప కార్యక్రమంలో సమస్యలు ఉన్నాయి మంచినీటి సౌకర్యం కల్పించాలని,నీరు కలుషితం వల్ల అనారోగ్యలకు గురిఅవుతున్నారు అని గ్రామస్తులు తెలియచేసినప్పటికి త్వరలోనే మంచి నీటి సమస్య నెరవేరుస్తామని హామీ ఇచ్చి, సమస్య గాలిలొ దీపంలా వదిలేసి ఏదో గొప్పలు చెప్పడానికే ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది అని తెలిపారు. అలాగే ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించలేని మరుక్షణం నిరశన కార్యక్రమం బలంగా ముందుకు తీసుకెళ్ళి కాళి బిందెలతో ITDA ముట్టడి చేసి నిరసన తెలియజేస్తాయమని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాడేరు మండల అధ్యక్షులు నందొలి మురళికృష్ణ, మండల నాయకులు వంపూరూ సురేష్, కించే దేవేంద్ర ప్రసాద్, మర్రి అశోక్, గెమ్మెలి కృష్ణ,పాంగి ప్రసాద్, వార్డ్ మెంబర్, గ్రామస్తులు పూజారి గంగమ్మ, కొర్ర శాంతి, లలిత, అనేక మంది జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.