జనం అంటే జగన్ కు అంత భయం ఎందుకు? తిరుపతి జనసేనపార్టీ ఇంఛార్జ్ కిరణ్ రాయల్

●జగన్ అప్పట్లో ముద్దులు, ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నాడు

●శ్రీవారి మెట్టు మార్గం ప్రారంభించేందుకు సీఎం ఎందుకు రాలేదు? ఏడుకొండల వెంకన్నపై జగన్ కు మమకారం లేదా?

● రాబోయే రోజుల్లో వైకాపా కనుమరుగు కాయం

● అందుకే గాల్లో వచ్చి గాల్లోనే వెళ్లిపోయాడు

      తిరుపతి, (జనస్వరం) : విద్యా దీవెనతో పాటు పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలపై తిరుపతికి విచ్చేసిన సీఎం జగన్ సాగిస్తున్న (వైసీపీ దోపిడీ పాలన) పై ప్రజలకు భయపడి (రోడ్డు మార్గాన్ని) వదిలి, గాలిలో నేరుగా ఫ్లైట్, హెలికాప్టర్ లతో సీఎం సభాస్థలికి చేరుకోవడం మహిళా పొదుపు సంఘాలను, ఇంటర్ విద్యార్థులను సభకు హాజరు కావాలని ఆంక్షలు విధించి బ్లాక్మెయిల్ చేయడం అత్యంత హేయమైన చర్యగా జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ విమర్శించారు. ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా మధ్య జనసేన నాయకులు రాజారెడ్డి, మధుబాబు, రాజేష్ యాదవ్, సుమన్ బాబు, హేమ కుమార్, ముక్కు సత్యవంతుడు, ఈశ్వర్ రాయల్, కృష్ణ, గోపి, లోకేష్, హరి నాయక్ తదితరులతో కలిసి కిరణ్ మాట్లాడుతూ సాధారణంగా గతంలో సభకు వచ్చిన వారికి డబ్బులు పంచె వారు. ఇప్పుడు సభకు రాకుంటే ఫైన్ వేస్తామని హుకుం జారీ చేయడం హాస్యాస్పదమన్నారు. దీనికి నిదర్శనం సభను వదిలి గోడదూకి పారిపోయేలా కాపలా కాచిన, వాలెంటర్ల్లు సాక్ష్యం అన్నారు. 10 పబ్లిక్ పరీక్షల పేపర్లు లీకేజీ వ్యాపారంగా మార్చేశారని ఆరోపించారు. ఇందులో డీబార్ అయిన విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఉండటం వైకాపా ప్రభుత్వం పాలన ( యధా రాజా తథా ప్రజా) అన్నట్లుగా ఉందని జగన్ పాలనపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీనికన్నా సీఎం కార్యాలయం నుంచే ఆన్లైన్లో ప్రారంభోత్సవ సభ కార్యక్రమాలు ముగించి ఉంటే భారీ ఖర్చు మిగిలి ఉండేది అని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way