– సూటిపశ్నతో మీడియా ముందు నిప్పులు చెలరేగిన జనసేన పార్టీ ఇంఛార్జ్ మాకీనీడి శేషుకుమారి
పిఠాపురం, (జనస్వరం) : ప్రజా ఆదరణ లేని ఆంధ్రా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కాపు నేస్తం గొల్లప్రోలులో నుండి వేయడానికి గల కారణం ఏంటని భయం భయం గాల్లో వచ్చిన సియం గాలిలోనే వెళ్ళాలి తప్పా ప్రజలు ఏమాత్రం పట్టించుకోరని పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు నగర పంచాయితీకి వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాకను ఉద్దేశించి పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ మాకీనీడి శేషకుమారి స్థానిక జనసేన పార్టీ కార్యాలంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ముందుస్తుగా గృహ అరెస్టులో ఉన్న ఆమె నిప్పులు చెలరేగేలా వ్యాఖ్యనించారు. స్థానిక ఏలేరు అధునికరణ పనులు పూర్తి చేస్తానని 2019 ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు సుద్ద కాలు పనులు ఎంత వరకు పూర్తి చేసారో చెప్పాలి వర్షాలు వరదలు వస్తునే ఉన్నాయి. రెండు వేల ఎకరాల పంటనష్టం 600 వందల రైతులు నష్టం జరుగుతూనే ఉంది గ్రామం వరద ముప్పుకి గురవుతూనే ఉంది కాని సుద్దకాలువ అధునికరణ చేయలేదన్నారు. ఇదేనారైతుపక్ష పార్టీ అని ఎద్దవేసారు. ఆంధ్రా రాష్ట్ర ప్రజలు ఈ నేస్తాలు సంక్షేమ పథకాల గురించి ఎదురు చూసే రోజులు పోయాయి. మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా పాతికేజీల బియం కాదు పాతిక సంవత్సరాల భవిష్యత్ ప్రజలకు కావాలని కోరుకుంటున్నారు. అది రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించిన రోజనే నెరవేరుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎం .పి వంగా గీతా విశ్వనాథ్ గార్లు గెలిఛిన తరువాత నియోజవర్గ అభివృద్ధి ఎంతవరకు చేసారో చెప్పాలన్నారు. పట్టణంలో ఎక్కడ చెత్తా అక్కడే ఉన్నా సిబ్బంది పెంచి పారిశుద్ధ్య చేయించడంలేదన్నారు. పరిశ్రాలు శుభ్రపరిచే ఒక్క వర్క్స్ ఆరుగురు అధికారులు ఉండి పని చేయిస్తుంటే చెత్త నిర్ములన ఎలా అవుతుదని సిబ్బందిని పెంచిన ప్పుడే చెత్త నిర్ములన అవుతుందన్నారు. మా నియోజవర్గంలో వీరువురు ఎంత వరకు అభివృద్ధి చేసారో సియం ఆరాతియ్యాలన్నారు. రోడ్లు బాగోపోవడంతో ఇటీవల గుడ్ మార్నిం సియం కార్యక్రమం ద్వారా మేలు కొల్పడం జరిగిందని ఇలాంటి విషయాలు అడుగుతామని ముందస్తు గృహ అరెస్టు చేయడం చూస్తుంటే జనసేన అంటే ఎంత భయం ఉందో అర్దమైవుతుంని ఎన్నికలు ఎప్పుడు పెట్టిన వైసీపీకి నియోజవర్గంలో డిపాజిట్లు రావని ప్రజలంతా పవన్ కళ్యాణ్ నాయకత్వం కోరుకుంటున్నారని గుడ్ మార్నింగ్ సియం అని నిద్ర లేపిన పవన్ కళ్యాణ్ రాబోయే కాలంలో కాబోయే సియం మా అధినేనని రోజులు లెక్కపెట్టుకోవడం తప్పా మీరు చేసేది ఏమిలేదన్నారు.