వెదురు కుప్పం మండల కేంద్రంలో సంత గేటు నందు నిరుద్యోగులకు అండగా నిరసన కార్యక్రమం సంత గేటు లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ యుగంధర్ పొన్న గారు హాజరై Dr. BR అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా యుగంధర్ పొన్న గారు మాట్లాడుతూ 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అధికారం లోకి వచ్చిన తరువాత మాట మార్చి మడమ తిప్పారు. ప్రతి యేటా జనవరి 1 న జాబ్ క్యాలండర్ ప్రకటన అని ఎన్నో తేదీలు మార్చి, ఇప్పుడు ప్రకటన చేయడం ఏమిటని ప్రశ్నించారు. గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 లో కేవలం 36 పోస్టులే, పోలీసు ఉద్యోగాలు 450 మాత్రమే అని, ఎన్నికల సభలలో పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం రోజున సంవత్సరానికి 6500 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్య మంత్రి ప్రకటన చేసారు. జాబ్ క్యాలెండరు విషయం లో ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు. ఏపిపిఎస్సి ద్వారా భర్తీ చేయదగ్గ ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఖాళీ అవుతున్నాయి. ఆ లెక్కలను ప్రభుత్వం ఎందుకు దాచి పెడుతుందని ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. DSC నోటిఫికేషన్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు. సర్కార్ కు ఉపాధ్యాయ పోస్టులు నింపే ఉద్దేశం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. గ్రామ సచివాలయాల్లో ఉన్న ఖాళీల మాటేమిటి అని ప్రభుత్వాన్ని నిలదీసారు. తరాలు మారినా తలరాతలు మారలేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు జనసేన అండగా ఉంటుందని, ఈ విషయాన్నీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గం మీడియా విభాగం ఇంఛార్జ్ వెంకటేష్, నియోజకవర్గం సమన్వయకర్త మధు, సురేష్, మండల ప్రధాన కార్యదర్శి మోహన్, కార్యదర్శి సతీష్, మండల బీజేపీ అధ్యక్షులు తిరుమల అచ్చారి , బిజెపి జిల్లా నాయకులు హనుమంత రెడ్డి, మండల నాయకులు గుణశేఖర్, ముని, సాయి,తులసి మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.