Search
Close this search box.
Search
Close this search box.

తుమ్మితే ఊడిపోయే మంత్రి పదవుల్లో ఉండే మీరా… పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించేది ? : వాసగిరి మణికంఠ

వాసగిరి మణికంఠ

               గుంతకల్ ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు చేసిన వైసీపీ మంత్రులపై ఘాటుగా స్పందించారు అనంత జిల్లా జనసేన కార్యదర్శి వాసగిరి మణికంఠ. పత్రికా సమావేశంలో మాట్లాడుతూ మా నాయకుడు ” కౌలురైతు భరోసా” యాత్ర ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైతే మొదలు పెట్టాడో అప్పట్నుంచీ ఈ వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మా నాయకుడి యాత్రకు ప్రజల్లో అత్యంత ఆదరణ లభించడంతో జీర్ణించుకోలేని వైసీపీ కొత్త మంత్రులు వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు. మీకు చేతనైతే ప్రజాక్షేత్రంలో ప్రజలు మీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఆర్టీసీ చార్జీల పెంపు, విద్యుత్ బిల్లుల పెంపు, కరెంటు కోతల వలన పడుతున్న ఇబ్బందులు పరిష్కారానికి కృషి చేస్తూ మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి లేదా మీరు ఇచ్చిన ఎన్నికల హామీలు ప్రత్యేక హోదా, ఉక్కు కర్మాగారం, విభజన హామీలు చట్టంలో పొందుపరచిన అంశాలపై పోరాటాలు చేయండి. ఇంకా మీ వైసిపి పాలనలో ఆకాశాన్నంటుతున్న నిత్యవసర వస్తువుల ధరలు ఉప్పు, పప్పు, బెల్లం, కంది బెల్లు ధరలు తగ్గించడానికి కృషి చేయండి. భవన నిర్మాణ రంగం కుదేల్ అవడానికి కారణమైన ఇసుక, ఐరన్, సిమెంటు ధరలు తగ్గించడానికి ప్రత్యేక చర్యలు గురించి ఆలోచన చేయండి. మీరు ఎన్నోసార్లు ప్రగల్భాలు పలికిన మూడు రాజధానుల ఎప్పుడు కంప్లీట్ చేస్తారో ప్రజలకు వివరణ ఇవ్వండి. రాష్ట్రంలో ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయి వాటి పైన చర్యలు తీసుకోండి, కొత్త రోడ్లు వేయండి, మీరన్న దశలవారీ మద్యపాన నిషేధం గురించి, జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ గురించి, సి.పి.ఎస్ రద్దు, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులు కుటుంబాలను ఎలా ఆదుకోవాలి ఆలోచన చేయండి. నిర్మాణాత్మకంగా ప్రభుత్వ విధానాలు, పాలసీలపై ప్రశ్నిస్తుంటే మీరు మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడడం మేము హేయమైన చర్యగా జనసేన భావిస్తోంది. ఇకమీదట ఇలాంటి పనికిమాలిన విమర్శలు చేస్తే మిమ్మల్ని రోడ్లపై కూడా తిరగనివ్వం, తుమ్మితే ఊడిపోయే పదవుల్ని పెట్టుకొని మీరు మాట్లాడకండి అని వాసగిరి మణికంఠ వైసిపి నాయకులను ఘాటుగా హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way