విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు సిగినం శెట్టి రాము గుప్తా గారి ఆధ్వర్యంలో విఎంసి ఆవరణలో మాయమైన మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాం గురించి వన్ టౌన్ లోని కాలేశ్వరం మార్కెట్ వద్ద గల గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన మహేష్ గారు హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా పోతిన మహేష్ గారు మాట్లాడుతూ మున్సిపల్ ఆఫీస్ సమీపంలో వుండవలసిన గాంధీ విగ్రహం ముక్కలు చేసి కరిగించి స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ రావు రోశయ్య గారి విగ్రం తయారు చేశారని పెద్ద ఎత్తున వార్తలు బయటి వస్తున్నాయని, ఈ అశం మీద మున్సిపల్ కమిషనర్ గారు స్పందించడం లేదని,మహాత్మా గాంధీ విగ్రహం మాయమైతే వైసిపి నాయకులు గాని మున్సిపల్ కమిషనర్ గాని స్పందించడం లేదంటే వీరికి మహాత్మా గాంధీ గారి విగ్రహం మాయం చేసిన ఘటన మీద పూర్తి అవగాహన ఉందని, గాంధి విగ్రహం మాయం చేసిన గాడ్సే కి మున్సిపల్ కమిషనర్ మీరు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో సమాధానం చెప్పాలని గాంధి విగ్రహం మయం అయితే మీరు ఎందుకు విచారణ చేయమని పోలీస్ కమిషనర్ గారిని కోరలేదు అంటే మీరే అధికార పార్టీ నాయకులకు గాంధీ విగ్రహాన్ని ముక్కలు చేసి కరిగించి రోషయ్యగారి విగ్రహం తయారు చేసుకోవడానికి సహకరించారఅని మున్సిపల్ కమిషనర్ గారు దీనికి మీరు సమాధానం చెప్పాలని రాయల్ హోటల్ సెంటర్ వద్ద ఉన్నటువంటి జనసేన పార్టీ దిమ్మను తొలగించడానికి ఆదేశాలు ఇచ్చిన మీరు గాంధీ గారి విగ్రహం కాపాడలేకపోవడం కనీసం నీకు సిగ్గనీ పించడం లేదా అని గాంధి విగ్రహం కాపాడలేని పనికిమాలిన మీరు మున్సిపల్ కమిషనర్గా ఉండడం ఎందుకు అని మీరు స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి వత్తాసు పలకడం దుర్మార్గం అని వెల్లంపల్లి శ్రీనివాసరావు పెద్ద ఎత్తున ఆర్యవైశ్య సంఘాల నుంచి రోశయ్య గారి విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పి డబ్బులు కొట్టేసి వాటిని దోచుకుని గాంధీ విగ్రహం కలిగించి రోశయ్య గారి విగ్రహం ఏర్పాటు చేసి డబ్బులు కోసం మహాత్మా గాంధీ గారి నీ అవమానించారని, ఆనాడు డబ్బుల కోసం మూడు సింహాలను మాయం చేసిన ఎమ్మెల్యే ఈనాడు గాంధీ విగ్రహం మయం చేశారని, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గాంధీ గారి విగ్రహం మాయమైన విషయంలో స్పందించే వాడివని నువ్వు ఈ ఘటనలో స్పందించకపోవడం చూస్తుంటే గాంధీ విగ్రహం మాయమైన ఘటనలో నీ పాత్ర కచ్చితంగా ఉందని, మేము పోలీస్ కమిషనర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని గాంధీ విగ్రహం మాయమైన ఘటనపై విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేస్తామని గాంధి విగ్రహం మాయం చేసిన గాడ్సే ని కటినంగా శిక్షించాలని మేము జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ,పొట్నూరి శ్రీనివాసరావు, ఆకుల రవిశంకర్, రెడ్డిపల్లి గంగాధర్, నల్లబెల్లి కనకారావు, మల్లెపు విజయలక్ష్మి, తిరపతి అనూష, ఎం హనుమన్, నేమని సంజీవరావు,వెన్న శివశంకర్ ,ముబీనా, బోట్టా సాయికుమార్, సాబీంకర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.