Logo
Date of Publish : 20 December 2022, 4:28 pm
Editor : Sake Naresh

అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవ ఆగదు : అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్

         అనంతపురం ( జనస్వరం ) : వైసిపి ప్రభుత్వం రహదారులకు ఏర్పడిన గుంతలు సైతం పూడ్చలేని దుస్థితిలో ఉందని.. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో స్పందించిన జనసేన జిల్లా అధ్యక్షులు & అర్బన్ ఇంచార్జ్ శ్రీ టి.సి.వరుణ్ గారు జనసేన రోడ్ల మరమ్మత్తుల శ్రమదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 6వ రోజు మంగళవారము రుద్రంపేట వద్ద రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో సిమెంట్ పొడి మిశ్రమాన్ని వేసి గుంతలు పూడ్చారు. రహదారి మొత్తం గుంతలుగా ఏర్పడి నీరు నిల్వ ఉండడంతో ఈ రోడ్డుపై ప్రయాణం దుర్భరంగా మారిందని స్థానికులు వాపోయారు. ఒక్క ఫోన్ కాల్ చేయగానే జనసేన నాయకులు శ్రీ టి.సి వరుణ్ గారు, నాయకులు మరియు జనసైనికులు స్పందించి రహదారికి మరమ్మతులు చేయడం పట్ల స్థానికులు జనసేన పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అనంత ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందడం ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోందన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ శ్రీ టి.సి.వరుణ్ గారి నాయకత్వంలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని జనసేన పార్టీని ఆదరించి టీ.సీ.వరుణ్ గారిని ఆశీర్వదించాలని. నాయకులు, జనసైనికులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు కుమ్మర నాగేంద్ర, నగర ఉపాధ్యక్షులు శ్రీ జక్కిరెడ్డి ఆదినారాయణ, జిల్లా కమిటీ సభ్యులు అవుకు విజయ్ కుమార్, ముప్పూరి కృష్ణ, నగర ప్రధాన కార్యదర్శులు మేదర వెంకటేష్, దరాజ్ భాష, నగర కార్యదర్శిలు విశ్వనాధ్, మురళి, శేషాద్రి, సంపత్, లాల్ స్వామి, ఆకుల అశోక్, కార్యక్రమాల కమిటీ సభ్యులు సంతోష్ కుమార్ మరియు నాయకులు పవనిజం రాజు, హరీష్ రుద్రంపేట, వడ్డే వెంకటేష్, నజీమ్, మళ్ళీ, నౌషాద్, తదితరులు పాల్గొన్నారు.
 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com