
రాజోలు, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా, రాజోలు నియోజకవర్గం, రాజోలు మండలం చెన్నడం గ్రామంలో వారం రోజుల నుంచి కుళాయిల సమస్య వల్ల ప్రజలకు త్రాగునీరు లేక అల్లాడిపోతున్నారు. చుట్టుపక్క నీరంతా ఉప్పునీరు ఆపై వేసవికాలం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో అక్కడి జనసేన నాయకులు బడుగు శీనుబాబు ఈ సమస్యను జనసేన రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీను దృష్టికి తీసుకురావడంతో ఆయన సొంత ఖర్చుతో చెన్నడం గ్రామ ప్రజలకి వాటర్ ట్యాంకర్ పంపించడం జరిగింది. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగినా జనసేన అండగా నిలబడుతుందని తెలియజేయడంతో గ్రామ ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి, జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.