• టంగ్,, టంగ్,,, టంగ్ మంటు ఫోన్లు మోగుతాయన్న ఎమ్మేల్యే గారు ఎక్కడ....??
• రైతు రుణమాఫీ ఎక్కడ ఎమ్మేల్యే గారు....??
• రైతురుణమాఫి కోసం కొకపేట భూములు అమ్మితే... మరి తెలంగాణలో ఉన్న మిగిత పథకాలకు ఎం అమ్మాలి....??
• 5రూపాయల భోజనం, 9సంవత్సరాల నుంచి, పేదల ఆకలి కనిపించలేదా,,, ఎమ్మేల్యే గారు....??
• నాగర్ కర్నూల్ స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి గారికి వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానేమో భయం ఏర్పడ్డది...?
నాగర్ కర్నూల్ ( జనస్వరం ) : ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరి మిత్రులతో, ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సంధర్బంగా లక్ష్మణ్ గౌడ్ గారు మాట్లాడుతూ రోజున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వట్టెం వద్ద నిర్వహించిన బి అర్ ఎస్ మీటింగ్ లో స్థానిక ఎమ్మెల్యే గారు మర్రి జనార్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ, రైతు రుణమాఫీ కోసం కె సి ఆర్ గారు కొకపెట భూములు అమ్మరాని సోమవారం ఉదయం పదిన్నర, పదకొండు గంటలకు రుణమాఫీ టంగ్ టంగ్ టంగ్ మంటు వస్తుందని, అన్నారు. దీంట్లో భాగంగా వంగ లక్ష్మణ్ గౌడ్ గారు ఇప్పుడు సాయంకాలం అవుతుంది. టంగ్ టంగ్ టంగ్ అనేది ఎక్కడ అంటూ చిటికలతో, దీనికి ఇప్పుడు భాధ్యత మీరా...లేక మీ ప్రభుత్వమా.? అంటూ ఎద్దేవా చేశారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద ఉన్న కుమ్మెర గ్రామ రైతులకు, అదనంగా ఇస్తానన్న లక్ష రూపాయలు ఎందుకు ప్రకటించట్లేదు. అని ఆగ్రహం వ్యక్తం చేశారు.అదేవిధంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ పేద ప్రజలకు MJR ట్రస్ట్ ద్వారా 5రూపాయలకే భోజనం అంటున్నారు. గత 9సంవత్సరాలుగా అధికారంలో ఉంది మీరే,,, ప్రభుత్వం మీదే... 9సంవత్సరాల నుంచి గుర్తుకు పేద ప్రజలకు ఎన్నికల ముందు మీకు కనిపిస్తుందా అన్నారు. కె సి ఆర్ గారు రైతు రుణమాఫీ కోసం కొకపెట భూములు అమ్మితే,, మరి తెలంగాణలో మీరు ప్రవేశ పెట్టిన పథకాలు దళిత బంధు, రైతు బంధు, బిసి బంధు (కొన్ని కులాలకే), షాదీ ముబరక్, కళ్యాణ లక్ష్మి, కొత్తగా గృహ లక్ష్మి, కంటి వెలుగు మరి పథకాల కోసము ఏమేం అమ్ముతారు. లేక తెలంగాణను తాకట్టు పెట్టే ప్రయత్నంలో ఉన్నారా...?? అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మిగులు బడ్జెట్ తో ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కొన్ని లక్షల కోట్ల అప్పులో ముంచెత్తిన ఘనత కేవలం బి ఆర్ ఎస్ కు మాత్రమే చెందింది అని అన్నారు. తెలంగాణలో దోచుకొని తిన్నారు,,, ఇప్పుడు భారత దేశంలో ఉన్నది దోచుకు తినడానికి బయల్దేరారు. మీ ఆటలు ఇక సాగవు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ... ఎన్నికల కోసం మీరు చేసే ప్రయత్నాలు అన్ని తిప్పి కొట్టి,, ప్రజలు నికు తగిన బుద్ధి చెప్తారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు గొపాస్ కుర్మన్న, విజయ్ గౌడ్, మహేష్ గౌడ్, సూర్య, వంశీ రెడ్డి, అరిఫ్, నాగరాజు, పూస శివ, రాజు నాయక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com