ఆళ్లగడ్డ, (జనస్వరం) : ఆళ్ళగడ్డ జనసేనపార్టీ కార్యాలయంలో జనసేనపార్టీ నాయకులు మైలేరి మల్లయ్య మీడియాతో మాట్లాడుతూ 17వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆళ్ళగడ్డ వస్తున్నారు. 2019 ఎలక్షన్ల ముందు జగన్ మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద రైతులకు 12,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి కేంద్ర ప్రభుత్వం మోడీ ఇస్తున్నటువంటి 6 వేల రూపాయలతో కలిపి రైతు భరోసా కింద 13,500 రూపాయలు ఇవ్వడం మడమ తిప్పడం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా 7,500 వేల రూపాయలకి రైతులకు 4 ఎరువుల బస్తాలు కూడా రావని అలాంటి పరిస్థితుల్లో మీరు ఆళ్ళగడ్డకు వచ్చి రైతు భరోసా కింద బటన్ నొక్కడానికి ఇంతదూరం రావాల్సిన అవసరం లేదని రైతులు ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నది రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర పంటను ఆరా పెట్టుకోవడానికి కళ్లాలు, పండించిన పంటను నిల్వ ఉంచడానికి వేర్ హౌస్లు కోరుకుంటున్నారు తప్పా మీరు ఇస్తున్నటువంటి 7500 వేల రైతు భరోసా కోసం కాదని రైతులు పండించిన పంటను వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి రైతుకు గిట్టుబాటు ధర కల్పించకుండా తక్కువ ధరకే కొనుగోలు చేసి రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వం, ఇటు దళారీ వ్యవస్థ ప్రత్యక్ష కారకులు కాదా అని ప్రశ్నించారు. ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో కొన్ని కుటుంబాల మధ్య రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తూ పదవులు అనుభవించి ఆళ్ళగడ్డ ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఆళ్ళగడ్డ గత యాభై ఏళ్ల సంవత్సరాల నుండి రాజకీయా నాయకులూ ఉన్నత పదవులు అనుభవించిన నేటికి డ్రైనేజి వ్యవస్థను చేయలేకపోయారు, 100 పడకల హాస్పిటల్ కూడా ఇప్పటికీ పూర్తికాలేదు కేవలం ప్రైవేట్ హాస్పిటల్ దళారులను పెంచి పోషించడం కాదా మీరు హాస్పిటల్ అభివృద్ధి చేయకపోవడానికి కారణం? ఆళ్ళగడ్డలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నిర్మించలేక లేకపోయారు, ప్రైవేట్ కాలేజీలు యాజమాన్యాలను పెంచి పోషించడం కాదా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయడానికి కారణం, చదువుకున్న యువతకు పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి కల్పించలేకపోయారు. రైతులు పండించిన పంటను నిల్వ ఉంచుకోవడానికి ప్రభుత్వ వేర్ హౌస్ లో నిర్మించక పోవడానికి కారణం, ప్రైవేటు వేర్హౌస్ దళారులను పెంచి పోషించడం కాదా? ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో రోడ్లు గుంతల మయంతో ప్రమాదం రూపంలో ఎంతో మంది గాయాలతో, చనిపోతున్నారని అలాగే సిరివెళ్ల, ఖాదరాబాద్ రహదారి మధ్యలో బ్రిడ్జి నిర్మించాలని, రుద్రవరం, చిన్నకంబలూరు రహదారి మధ్యలో బ్రిడ్జి నిర్మించాలని, చాగలమర్రి, ముత్యాలపాడు రహదారి మధ్యలో బ్రిడ్జి నిర్మించాలని, ఇవే కాకుండా చాలా ప్రాంతాల్లో బ్రిడ్జిలు లేక చిన్నపాటి వర్షానికే ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతూ వాగులు దాటుతూ చనిపోతున్నారని తెలియజేశారు. 40 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ హయాంలో ఏర్పడినటువంటి తెలుగు గంగ కాలువలు నేటికీ పూర్తి కాకపోవడం ఆళ్లగడ్డ రాజకీయ నాయకుల చేతగానితనం కాదా? ఆళ్ళగడ్డలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అహోబిలం, రామ తీర్థం అభివృద్ధికి ఎందుకు నోచుకోలేదు దళారీ వ్యవస్థను ఎవరు పోషిస్తున్నారు? ఆళ్ళగడ్డ టౌన్ లో 30 వేల జనాభా ఉండి కూడా కనీసం సాయంకాలం సేదతీరడానికి ఒక పార్క్ కూడా నిర్మించ లేకపోవడానికి పాలకుల చేతగానితనం కాదా?ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఎంత మంది నాయకులు వచ్చిన, పదవులు అనుభవించిన వారి కుటుంబాలు ఆర్థికంగా ఏది గారే తప్పా ఆళ్ళగడ్డ నియోజకవర్గం అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎవరికి లేకపోవడం సిగ్గుచేటు కాదా, ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో రాజకీయాలను శాసిస్తున్నది కొన్ని వర్గాలు కాదా ఆళ్ళగడ్డ నియోజకవర్గం అభివృద్ధి చేస్తుంటే ప్రజలు ఏమైనా మిమ్మల్ని ఆపరా అభివృద్ధి చేయరు ఎందుకంటే ప్రజలు ఎప్పటికీ కష్టాల్లో ఉండాలి, సమస్యలతో నాయకుల కోసం ఎదురు చూడాలి ప్రజల పేదరికాన్ని ఆసరా చేసుకుని రాజకీయంగా లబ్ధిపొంది ప్రజల సమస్యలను గాలికి వదిలేయడం కాదా? రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆళ్ళగడ్డ నియోజకవర్గ అభివృద్ధికి మీరేం మీరేం చేయబోతున్నారో ప్రజలకు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నది సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆళ్ళగడ్డ నియోజకవర్గ సమస్యలు ముఖ్యమంత్రికి తెలియజేసి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని ఆళ్ళగడ్డ జనసేనపార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాచంశెట్టి వెంకట సుబ్బయ్య, కుమ్మరి నాగేంద్ర, బావికడి గుర్రప్ప, చైతన్య తదితరులు పాల్గొన్నారు.