Logo
Date of Publish : 28 March 2023, 8:44 am
Editor : Sake Naresh

అకాల వర్షాల వలన నష్టపోయిన అన్నదాత లకు నష్ట పరిహారం ఎక్కడ..? : గునుకుల కిషోర్

           నెల్లూరు ( జనస్వరం ) : బిడ్డల బంగారు భవిత కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన పార్టీ ఓటు వేసి నిస్వార్ధ నాయకుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అంటూ..... సర్వేపల్లి నియోజకవర్గం బండ పాలెం లో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాలలో జలం ఉంటే సంపద ఉన్నట్లు భావిస్తారు. సముద్రపు ఒడ్డున ఉన్న ప్రాంతాలన్నీ వాణిజ్య సంపద తో నిండి ఉంటాయని అర్థం. ఈ సర్వేపల్లి నియోజకవర్గం లో కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే సంపదతో నిండాయి. మిగిలిన వారందరూ పేదరికం అనుభవిస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించటం లో కానీ, ఆర్ బి కే కేంద్రాల లో తగిన ఎరువుల సరఫరా చేయలేక పోయారు. వ్యవసాయం చేసే వారిలో ఎక్కువ ఉన్న కౌలు రైతులు అకాల వర్షాల వల్ల చేతికి వచ్చిన పంట నష్టపోయి అప్పులతో మునిగి పోయి ఆత్మహత్య చేసుకుంటుంటే పట్టించుకునే పరిస్థితి లేదు. దళారుల బారిన పడకుండా రైతులకు గిడ్డంగులు కల్పించటం లో విఫలమయ్యారు. అకాల వర్షాల వలన నష్టపోయిన అన్నదాత లకు నష్ట పరిహారం ఎప్పుడొస్తుందో,తడిసిన ధాన్యం ఎప్పుడు కొంటారు తెలియక రైతులు సతమతమవుతున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సొంత సంపాదన నుంచి దాదాపు 30 కోట్ల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు భరోసాగా నిలిచారు. స్థానిక సమస్య ఏదైనా కానీ జనసేన పార్టీ తరఫున జనసైనికులు పోరాటం జరిపేందుకు సిద్ధంగా ఉంటారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో నిస్వార్ధ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి గెలిపించేందుకు గాజు గ్లాసు పై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించాల్సిందిగా మనవి చేశారు. ఈ కార్యక్రమంలో కిషోర్ తో పాటు స్థానిక నాయకులు శ్రీపతి రాము, అశోక్, వెంకీ, హేమచంద్ర యాదవ్, ప్రశాంత్ గౌడ్, చిన్న రాజ, ప్రసన్న, శంకర్, మౌనేష్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com