
నెల్లూరు, (జనస్వరం) : విధులలో వుండాల్సిన అధికారులు ఎక్కడ? అంటూ జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ బుచ్చి, ఖాదర్ నగర్ లో మున్సిపల్ కాంట్రాక్టరు నిర్లక్ష్యానికి నేల కొరిగిన ఇళ్ళ నిరాస్వితులకు నష్ట పరిహారం అందించాలని కోరుతూ కమిషనర్, చైర్ పర్సన్, ఎం ఆర్ ఓ లకు అర్జీలు ఇచ్చేందుకు బుచ్చి తహశీల్దార్ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ నెలలో బుచ్చి ఖాదర్ నగర్ కాంట్రాక్టరు నిర్లక్ష్యం వల్ల నేలకొరిగిన ఇంటి బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన వారెవరూ స్పందించటం లేదు. వారి తరపున అర్జీ ఇస్తామని గంటల సమయం వేచి వున్నా ఎం ఆర్ ఓ గాని, ఇంఛార్జి ఎం ఆర్ ఓ గాని అందుబాటులో లేరు. అసలు ఆఫీస్ లో ఖాళీ కుర్చీలు దర్శనం ఇస్తున్నాయి. ప్రజా క్షేత్రంలో ప్రజలకు అందుబాటులో వుండాల్సిన అధికారులు ఇలా రెస్పాండ్ అవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇక మున్సిపల్ చైర్ పర్సన్ అయతే స్పందన కార్యక్రమం సమయంలో తప్ప మిగిలిన సమయంలో అందుబాటులో ఉండేలా లేరు. మున్సిపల్ కమిషనర్ తమ దృష్టికి రాలేదని పరిశీలిస్తామని తెలిపారు. ఎటువంటి నోటీస్ లు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోకుండా అజాగ్రత్తగా వ్యవహరించటం వలన వారి కుటుంబం వీధిన పడింది. కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వారికి మానవతా దృక్పథంతో స్పందించి నష్ట పరిహారం అందించాలని, కాని పక్షంలో బాధితుల కోసం జనసేన తరపున న్యాయపరంగా అండగా నిలబడి వారికి పరిహారం అందేవరకు తోడుగా నిలబడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్ తో ఖాదర్, షారు, సాయి, ఋషి, ఖాసిఫ్, ప్రశాంత్ గౌడ్, హేమ చంద్ర యాదవ్, షాజహాన్ తదితరులు పాల్గొన్నారు.