రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగాల విప్లవం అంటూ విడుదల చేసిన జాబ్స్ కాలెండర్ లో లక్షల మంది నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తున్నారు అని యస్ కే యు , భగత్ సింగ్ విద్యార్థి విభాగం అధ్యక్షులు జయంత్ వర్ధన్ అన్నారు. 2019 నుండి నేటి వరకు 6,03,756 ఉద్యోగాలు ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్న రాష్త్ర ప్రభుత్వం అందులో 2,59,565 వాలంటీర్స్ ఉద్యోగాలు కలిపారు. గతంలో వాలంటీర్ ఉద్యోగం కాదు స్వచ్ఛంద సేవ అని మీరే చెప్పారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వేల మంది ఆశలు పెట్టుకున్న ఏపీపీఎస్సీ గ్రూప్1, గ్రూప్2 కి కేవలం 36 ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి అని ప్రశ్నిచారు. ప్రస్తుతం యువత చాలా మంది ఏపీపీఎస్సీ నుండి వచ్చే గ్రూప్1, గ్రూప్2 నోటిిపికేషన్లు కోసం ఎదురు చూస్తూ కోచింగ్ తీసుకుంటున్నారు అని ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి అని అడిగారు. అంతే కాకుండా 2021-22 గాను కేవలం 10,143 ఉద్యోగాల? ఇదేనా ఉద్యోగాల విప్లవం? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. “నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, జగనన్న జాబ్ క్యాలెండరు లో జాబ్స్ వుండవు! ఇదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం యొక్క సూత్రం!” అంటూ సభా వేదికగా నిరుద్యోగ యువత తరపున జయంత్ వర్ధన్ గారు రాష్త్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో టీచర్ పోస్టులు 25 వేలు,కానిస్టేబుల్ పోస్టులు 16 వేలు,లైబ్రరీ సైన్స్ 6వేలు పోస్టులు,సచివాలయంలో 8 వేలు ఖాళీగా వున్న వీటిని ఈ క్యాలెండర్ లో పేర్కొనలేదు అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు . వీటిని పరిశీలించి నిరుద్యోగ యువకులకు కు వెంటనే న్యాయం చేయకపోతే వీటిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని పేర్కొన్నారు . ఈ కార్యక్రమములో జనసైనికులు, నిరుద్యోగులు,విద్యార్థులు మరియు తదితురులు పాల్గొన్నారు.