Logo
Date of Publish : 12 December 2023, 10:30 pm
Editor : Sake Naresh

ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎక్కడ జగన్ ?

    అనంతపురం ( జనస్వరం ) : ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల తమ జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే దౌర్భాగ్య పరిస్థితి? ప్రతినెల పింఛన్దారులకు తమ పింఛన్ ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడిందని జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు జయరాం రెడ్డి అన్నారు. గెలిచిన వారం రోజుల్లోనే CPS రద్దు చేస్తా? అధికారంలోకి వచ్చిన తక్షణమే మెరుగైన PRC చెల్లిస్తా? అని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక... ప్రభుత్వ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని అడిగితే, ప్రభుత్వ ఉద్యోగులని YCP ప్రభుత్వం అష్ట కష్టాలకు గురి చేస్తూ, సకాలంలో జీతాలు కూడా చెల్లించకుండా? అపహేళన చేస్తూ, ప్రజల్లో చులకన చేయాలని YCP ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో వికృత క్రీడ ఆడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు... మనోవేదనతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని తికమక పరిస్థితుల్లో దాపురించినాయి. ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి, ఉపాధ్యాయుడు బోయ మల్లేష్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా బాధాకరం. ఇప్పటికైనా YCP ప్రభుత్వం తక్షణమే కళ్ళు తెరిచి ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా సకాలంలో జీతాలు చెల్లించి వారి న్యాయమైన డిమాండ్లన్నింటినీ చిత్తశుద్ధితో పరిష్కరించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.  ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బోయ మల్లేష్ వారి కుటుంబ సభ్యుల్ని కలుసుకొని పరామర్శించి, వారికి మనోధైర్యాన్ని కల్పించి, జనసేన పార్టీ మీ కుటుంబానికి, ప్రభుత్వం ఉద్యోగులందరికీ ఎల్లవేళలా అండగా, అందుబాటులో ఉంటుందని భరోసా కల్పించడం జరిగింది. ఆత్మహత్యకు ప్రయత్నించిన ఉపాధ్యాయుడిని వారి కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురిచేసి YCP ప్రభుత్వానికి చెందిన ఉన్న ఒక వార్త పత్రికలో... అప్పులతో ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడని తప్పుడు కథనం రాయడం చాలా విడ్డూరంగా ఉంది. సాధ్యాసధ్యాలను పరిశీలించి జనసేన -- టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నీటికి చక్కటి పరిష్కారం చూపుతాడు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు అధైర్య పడకండి అని భరోసా కల్పించిన అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, లీగల్ సెల్ అధ్యక్షుడు మురళీకృష్ణ, జనసేన నాయకులు మెరుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com