నెల్లూరు, (జనస్వరం) : పెన్నా వంతెన పూర్తయ్యేదెప్పుడో? దశాబ్దాల కాలంగా నత్తనడకన నడుస్తున్న నెల్లూరుకి ప్రతిష్టాత్మకమైన పెన్న వంతెన ఎక్కడ ల్యాండ్ అవుతుందో ఇప్పటికీ క్లారిటీ లేదు అని నెల్లూరు జిల్లా జనసేన నాయకులు అన్నారు. అధికార పార్టీ జలవనరుల శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో పనులు కూడా పూర్తి చేయలేకపోతున్నారు. 71 సంవత్సరాలు మించిన వంతెన మీద ఇప్పటికీ రాకపోకలు నగరానికి జరుగుతున్నాయి. 100 కోట్లు నిర్మాణంతో కొత్త వంతెనలో వేసే ప్రతిపాదనలు ఆయనకే తెలియాలి. జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గం వచ్చిన సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ గారు మరియు సిటీ నాయకులు సుజయ్ బాబు ఆధ్వర్యంలో పెన్నా వంతెన ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2005 లో ప్రారంభమైన పెద్ద వంతెన కాంగ్రెస్, టిడిపి హయాంలో మారుతూ వచ్చిన ఇప్పటివరకూ శంకుస్థాపనకు నోచుకోలేదని దశాబ్దాలు గడుస్తున్నా ఆ పార్టీ ఎక్కడ ల్యాండ్ అవుతుందో కూడా ఇప్పటికీ ఒక అవగాహన లేకుండా పోయిందని, ఈ మధ్య కొత్తగా ప్రతిపాదనలు తెచ్చిన కొత్త వంతెన బ్రిడ్జి ఎటుపోయిందో, 71 సంవత్సరాలుగా ఎన్నో మరమ్మతులకు గురై సిటీకి ఉన్న ఒకే ఒక కనెక్షన్ వంతెన ఏదైనా ప్రమాదాలకు గురి అయితే దానికి కారణం ఎవరని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు గంటా స్వరూప, విజయ్ శేఖర్ కొట్టే వెంకటేశ్వర్లు, కత్తి తిరుమల జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, నగర నాయకులు సుజయ్ బాబు కార్యదర్శులు ప్రశాంత్ గౌడ్, పూసల మల్లేశ్వరరావు, కత్తి తిరుమలతో పాటు జనసేన నాయకులు, జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.