వీరఘట్టం, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 17వ రోజు గిరిసేన జనసేన - జనం వద్దకు జనసేన కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతాలకు, వివిధ గ్రామాలకు వెళ్ళు రహదారులను వీరఘట్టం జనసైనికులు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజన్న రాజ్యంలో రహదారులు ఏవి? రోడ్లు రిపేర్ చేయండి సీఎం సారు, మా ఊరికి దారేది ఎం.ఎల్.ఎ సార్, ఎంపీపీ గ్రామనికి వేల్లె రహదారి అధ్వాన్నంగా ఉంది, నియోజకవర్గ యంయల్. ఎ మరియు ఎం.పి నిధుల ఏమి అవుతున్నాయని అంటూ వీరఘట్టం జనసేనపార్టీ నాయకులు ప్రశ్నించారు. పాలకొండ నియోజకవర్గ పరిధిలోని రోడ్ల మీద గుంతలు స్టేట్ హైవే కావచ్చు, జిల్లా కేంద్రానికి కలిపే దారులు కావచ్చు, గ్రామాలకు, గూడలకు వెల్లు రోడ్లు కావచ్చు, వీధిలో రోడ్లు కూడా గోతులుమయంగా ఉందని తెలిపారు. ఎక్కడ చూసినా గోతులు గోతులు ఇది ఒక గోతుల ఆంధ్రప్రదేశ్ గావుంది. వీరఘట్టం మండల కేంద్ర నుండి వివిధ గిరిజన గ్రామాలకు వెల్లు రహదారులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి అని, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పీఎం సడక్ యోజన నిధులు ఏమి అయ్యాయని మత్స పుండరీకం ప్రశ్నించారు? జనసేన జాని మాట్లాడుతు ప్రతి మీటరు మీటరకు గోతులు ఉన్నాయి. ప్రజల బతుకు భారమైపోతుంది. ఈ గుంతల వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. ప్రజల ఆరోగ్య పరిస్థితి పాడవుతుందని ప్రాణాలు పోతున్నా కానీ వైసీపీ ప్రభుత్వం గాఢ నిద్రలో ఉంటూ పాలన చేస్తున్నారు. పాలకొండ నియోజకవర్గ పరిధిలోని రహదారులకు గోతులు పూడ్చి రోడ్లను బాగుచేయాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నేన సాయి పవన్, జరజాపు రాజు, బోమ్మాలి వినోద్, సొండి సుమన్, సొండి అమల, దూసి ప్రణీత్, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com