Logo
Date of Publish : 14 July 2022, 3:06 pm
Editor : Sake Naresh

మద్యపాన నిషేధం ఇంకెప్పుడు చేస్తారు జగన్ రెడ్డి ? : దారం అనిత

          మదనపల్లి ( జనస్వరం ) : చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారి పార్టీ మానిఫెస్టోలో మద్యం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని, మద్యాన్ని దశల వారీగా నిషేదిద్దామని నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తరువాత అదే పెద్ద ఆదాయ వనరుగా చూస్తున్నారు. అధికార పార్టీ ప్రజల ప్రాణాలు ఏమైపోయినా పర్లేదు గానీ ప్రభుత్వానికి మాత్రం ఆదాయం వచ్చి తీరాలి అని అనుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంటే నియంత్రించాల్సిన ప్రభుత్వం మద్యం అమ్మకాలు పెంచి ఆ ఆదాయం మీద అప్పులు తేవాలని చూడడం బాధాకరం. జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ఏపీ బెవరేజ్స్ కార్పొరేషన్ ఆదాయం చూపించి రూ.8,300 కోట్ల అప్పులు తీసుకొని వచ్చింది. ఇప్పుడు మద్యం మీద పెరిగిన ఆదాయాన్ని చూపించి రూ.25 వేల కోట్ల అప్పులు తీసుకొని రావడానికి ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తుంది. ప్రజల ఆరోగ్యం కంటే కూడా ఆదాయం ముఖ్యం అనుకోవడం ఖచ్చితంగా పౌర సమాజం ఖండించాల్సిన అంశం అని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com