Logo
Date of Publish : 01 July 2023, 6:02 pm
Editor : Sake Naresh

బొబ్బిలి గ్రంథాలయం ఎప్పుడు కడతారు MLA శంబంగి గారు?

        బొబ్బిలి ( జనస్వరం ) : చదువులకు నిలయంగా ఉన్న బొబ్బిలిలో శాశ్వత గ్రంథాలయం కూడా పూర్తి చెయ్యాలేని పరిస్థితులో ఈ ప్రభుత్వం, MLA గారు ఉండటం బాధాకరమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు అన్నారు. ఆయన మాట్లాడుతూ శాశ్వత భవనం మీరు ఇపుడు ఎలాగూ నిర్మించలేరు. కనీసం ఇప్పుడున్న తాత్కాలిక భవనంలో టాయిలెట్ సధుపాయం, పాడైపోయిన బోరింగు పునరుద్ధరణ చిల్లులు పడ్డ భవనం పైకప్పులను తీసి కొత్తవి వేసి, కనీసం పుస్తకాల స్టోరేజీకీ కొన్ని బీరువాలు అలాగే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం అవసరమైన పుస్తకాలు అందుబాటులోకి తక్షణమే తీసుకురండి అంటూ స్థానిక MLA శంబంగి చినప్పలనాయుడు గారికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు గారు హితవు పలికారు. ఈ వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేనియెడల జనసేన పార్టీ తరపున మేమే చందాలు వేసుకుని మరీ గ్రంథాలయం మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, తెర్లాం మండల అధ్యక్షులు మరడాన రవి, బలిజిపేట మండల అధ్యక్షులు బొంకురు పోల్ నాయుడు, జనసేన నాయకులు పళ్లెం రాజా, పైలా సాయిరాం , గేదెల శివ, జగన్ రామభద్రపురం మండల నాయకులు చీమల సతీష్, రమేష్, సీతానగరం మండల నాయకులు శివ శంకర్ గారు జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com