
కృష్ణా ( జనస్వరం ) : అవనిగడ్డ నియోజకవర్గం, నాగాయలంక మండలం ఎదురుమోండి వాసుల కష్టాలు తీరెదెప్పుడని గ్రామ ప్రజలు అసహన వ్యక్తం చేస్తున్నారు. ఎదురుమోండి బ్రిడ్జి నిర్మాణం మొదలు అయ్యేది ఎప్పుడు?? బందరు పోర్టు లాగానే కేవలం మాటలకే పరిమితం అయిన ఎదురుమోండి బ్రిడ్జి నిర్మాణం అని జనసేన నాయకులు వాపోయారు. జనసేన నాయకులు మాట్లాడుతూ 2019 వరదలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న రోడ్డు కోతకి గురైంది. కానీ ఇప్పుటి వరకూ ఎలాంటి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చెయ్యలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు మాటలు మాత్రం బాగా చెప్తున్నారు కానీ ఎలాంటి అభివృద్ధి పనులు చెయ్యడం లేదు అని ఎదురుమోండి గ్రామ ప్రజలు అంటున్నారు. ఈ సమస్య మీద ప్రభుత్వాన్ని బలంగా ప్రశ్నించి, అధికారుల మీద ఒత్తిడి తెస్తామని నాగాయలంక మండల జనసేన అధ్యక్షులు చింతా వెంకటేశ్వరరావు అన్నారు. బైక్ ర్యాలీగా వెళ్ళి ఎదురుమోండి బ్రిడ్జి వంతెనను పరిశీలించారు. తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, లేనిచో జనసేన పార్టీ తరుపున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు.