Logo
Date of Publish : 04 November 2023, 8:53 pm
Editor : Sake Naresh

డంపింగ్ యార్డ్ ని ఎప్పుడు తరలిస్తున్నారు?

          అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి గారు ఎన్నికల ముందర అనంత నగర ప్రజలకు ప్రధాన హామీగా ఇచ్చిన... డంపింగ్ యార్డ్ ని ఎప్పుడు తరలిస్తున్నారు? గత 20 సంవత్సరాలుగా రాజీవ్ కాలనీ పంచాయితీ, గుత్తి రోడ్డు నందు నివాసం ఉంటున్న ప్రజలు డంపింగ్ యార్డ్ సమస్య వల్ల నరకయాతన అనుభవిస్తున్నారని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి అన్నారు.  శ్వాస కోస వ్యాధులకు గురై ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. చెత్త నుంచి సంపద సృష్టించే బయోమైనింగ్ ప్రక్రియ, అనుభవం లేని కంపెనీకి కాంటాక్ట్ ఇవ్వడం వలన పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని... సాక్షాత్తు వైసిపి కౌన్సిలర్లు... కౌన్సిల్ మీటింగులో మాట్లాడుతున్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి గారు మీకు కూడా? తెలియకుండా డంపింగ్ యార్డ్ తరలింపు ప్రక్రియలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగే అవకాశం ఉంది అంటారా? అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రాం రెడ్డి గారిని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం డంపింగ్ యార్డ్ అవినీతి, అక్రమాలపైన తగిన విచారణ జరిపి అనంత నగర ప్రజలకు వాస్తవాలు తెలియజేసి మేము స్వచ్ఛ స్వచ్ఛశీలులం అని రూపించుకోవాలి? తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన డంపింగ్ యార్డ్ ని గుత్తి రోడ్డు నుంచి తరలించి అనంతపురం నగర ప్రజల ఇక్కట్లు తీర్చాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com