Logo
Date of Publish : 14 August 2023, 10:01 pm
Editor : Sake Naresh

డి‌ఎస్‌సి నోటిఫికేషన్ ఎప్పుడు బొత్స గారు ? : మత్స పుండరీకం

         పాలకొండ ( జనస్వరం ) : వీరఘట్టం మండల కేంద్రలో జనం కోసం జనసేన - ప్రజల వద్దకు పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స. పుండరీకం మీడియా తో మాట్లాడుతూ నిన్న విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ గారు జనసేన పార్టీని ఉద్దేశిస్తూ ఉగాది తర్వాత జనసేన పార్టీ ఉంటే గుండు కొట్టించుకుంటానని అన్నారు. ఆయన ఉద్దేశ్యం 2024 లో వచ్చే ఉగాది తరువాత జనసేన పార్టీ ప్రతిపక్ష పార్టీ గా ఉండదు, జనసేన పార్టీ అధికారంలో ఉంటుంది అని అర్ధం. అని మత్స.పుండరీకం అన్నారు. బొత్సా గారు ఉగాది తరువాత గుండు కొట్టిoచు కోడానికి సిద్ధంగా ఉండాలని ఆ గుండు కూడా ఋషి కొండలా ఉండాలో రామతీర్థం కొండలా ఉండాలో చెపితే అలా చేయిస్తామని జనసేన నాయకుడు మత్స.పుండరీకం అన్నారు. ఇప్పటికే తెలంగాణ లో చెల్లి కాంగ్రెస్ షర్మిల (వైస్సార్టీపీ ) విలీనం కి సిద్ధంగా ఉన్నారు. మరి అన్న కాంగ్రెస్ (వైస్సార్సీపీ ) ఉగాది తరువాత ఉంటుందో లేదో? అని బొత్స సత్యనారాయణ మాటల్లో అర్ధం అని మత్సపుండరీకం తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలని అభివృద్ధి చేయడం చేతకాదు, ఉత్తరాంధ్ర జిల్లాలో రహదారులు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి, వాటికి రహదారులు వేయించoడి బొత్స గారు. విజయనగరం జిల్లా రామ తీర్థంలో రాముల వారి తల తీసిన వారిని ఇంతవరకు పట్టుకోలేదు కాని మీడియా తో మాటాడుతారు. జామి అనిల్, పోరెడ్డి ప్రశాంత్ లు మాట్లాడుతూ మీ నియోజక వర్గం పరిధి లోని గరవిడి మండలం లో పరిశ్రమలు తరలిపోతున్నాయి వాటికోసం ఆలోచించి ఉద్యోగులకు భరోసా ఇవ్వoడి బోత్స సత్యనారాయణ గారు. మీ మాయ మాటలు నమ్మి ఎంతో మంది నిరుద్యోగులు డి.యస్.సి కోసం ఎదురుచూస్తున్నారు. మీరు నిజంగా విద్య శాఖ మంత్రి ఐతే డీ.ఎస్.సి (ఉపాధ్యాయు ఉద్యోగ) నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దండేల చందు, కర్ణేన సాయి పవన్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com