
విజయవాడ, (జనస్వరం) : ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ, ప్రమాదాల బారిన పడుతున్న విఎంసి అధికారులు & రైల్వే అధికారులు స్పందించట్లేదని జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి ఏడాదిగా ఎర్ర కట్టకు కనీస మరమ్మత్తులు చేయించడంలో వైఫల్యం చెందారని ఆయన అన్నారు. వైసిపి కార్పొరేటర్లు పూర్ణ, చలపతిరావు ఈ సమస్య పై కనీస దృష్టి సారించకుండా స్థానిక ప్రజల ఇబ్బందులను గాలికి వదిలేశారని అవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ స్థానిక డివిజన్ అధ్యక్షులు సోమీ గోవింద్, నాయకులు ఆది తదితరులతో కలిసి పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ శనివారం ఉదయం ఈ ప్రాంతాన్ని సందర్శించి స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకుని తొందరలోనే ఈ సమస్య పరిష్కారం కోసం జనసేన పార్టీ తరఫున కృషి చేస్తామని హామీ ఇచ్చారు.