గత నిర్ణయం ప్రకారం గరుడ వారధిని, శ్రీవారి నిధులను స్వాహా చేయకుండా అనుకున్న ప్రకారం పూర్తి చేయాలని అలాగే కపిలతీర్థం నుండి అలిపిరి వరకు రెండవ దశ వైసిపి వాళ్ళ వాటా కోసం గరుడను పొడిగింపు కోసం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని దీని వలన కపిలతీర్థం స్వామివారి బ్రహ్మోత్సవాల ఊరేగింపుకు అరిష్టం జరుగుతుందని, తిరుమల తిరుపతి ప్రకృతి, సాంప్రదాయాలు, వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ గరుడ వారధి కొత్తగా చేపట్టబోతున్న ఫ్లై ఓవర్ నిర్ణయాలను టీటీడి మరొక్కసారి పునరాలోచించుకోవాలని తిరుపతి జనసేన పార్టీ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో వీరు మీడియాతో మాట్లాడుతూ 674 కోట్ల గరుడ బడ్జెట్లో టీటీడీ నిధులు 65%( స్మార్ట్ సిటీ )కేంద్రం నిధులు 35 శాతమని వీటితో మొదటి దశ గరుడ వారధి ప్రాజెక్టును 100% పూర్తిచేసి పాలకులు నీతిమంతులని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమములో జనసేన నేతలు కిరణ్ రాయల్, రాజారెడ్డి, రాజేష్ యాదవ్, సుమన్, ఆకేపాటి సుభాషిని, పగడాల మురళి, ప్రియ మునిస్వామి, అమృత మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.