Logo
Date of Publish : 08 November 2022, 11:15 am
Editor : Sake Naresh

“గరుడాచలం నాయుడు” అనే మహానుభావుడు పేద ప్రజల కోసం ఇచ్చిన స్థలాలపై మీ పెత్తనం ఏంటి? గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు

      గుంటూరు, (జనస్వరం) : గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో తూర్పు సత్రం 1858లో "గరుడాచలం నాయుడు "అనే మహానుభావుడు బీద ప్రజల కోసం టౌన్ లో 22 ఎకరాలు భూమిని అదేవిధంగా ఈ ప్రాంతంలో 92 ఎకరాల వ్యవసాయ భూమిని దానంగా ఇచ్చి వాటిపై వచ్చే ఆదాయాన్ని ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా అంటే ఇక్కడ నివసించే ప్రజలు చనిపోయిన తర్వాత వారి యొక్క కర్మకాండలు చేసుకునే విధంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడమైనది. తరువాత కాలంలో ఈ ట్రస్ట్ ప్రభుత్వం ఎండోమెంట్ వాళ్ళ తీసుకోవడం జరిగింది.ఆ తరువాత రాజకీయ నాయకులు కన్ను పడి 22.38 సెంట్లు ఉన్న భూమి ఈ రోజుకి కేవలం 5 ఎకరాలుగా ఉన్నది. మిగతా 15 ఎకరాలు ఎటు పోయినాయి కూడా తెలియని పరిస్థితి. ఎవరు ఆక్రమించుకున్నారు అనేది తేలాల్సిన విషయం. ఇప్పుడు ఉన్న 5 ఎకరాలు రాజకీయ నాయకులు తమ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఈ స్థలాన్ని తమ సొంత స్థలంగా ప్రైవేటు వ్యక్తులకు లీజులకు ఇస్తూ వాటిపై వచ్చే ఆదాయం ఎటుపోతున్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఇక్కడ వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై జనసేనపార్టీ ఆధ్వర్యంలో మేము EO శ్రీనివాసరావుని కలసి వీటిపై ఆరా తీయడం జరిగింది. వారు చెప్పేదేమిటంటే ఇక్కడ 5 ఎకరాల్లో 1.58 సెంట్లు ఎమ్మెల్యే బంధువులకు ఒక సంవత్సరానికి లీజుకు ఇవ్వడం జరిగిందని మిగతా స్థలం అంతా మా చేతుల్లోనే ఉందని వారు తెలియజేశారు. కానీ లీజు తీసుకున్నవారు ఉన్న స్థలాన్ని మొత్తంలో క్రష్టర్లతో నింపేసి ఇష్టం వచ్చిన విధముగా చేస్తున్నారు. ప్రజల కర్మకాండలు చేసుకునే విధంగా ఇక్కడ ఎటువంటి సౌకర్యం లేకుండా ఉంది. త్వరలో ఇక్కడ ఎలాంటి అసౌకర్యాలు కల్పించకుండా చూస్తానని EO శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. అలా జరిగని పక్షంలో జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలబడి అవసరమైతే రోడ్డు ఎక్కి ధర్నా చేస్తామని వారిని హెచ్చరించడం జరిగింది. ఈ విషయమై డిస్టిక్ ఎండోమెంట్ వారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటానికి బయలుదేరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, గుంటుపల్లి తులసికుమరి, నామన శివన్నారాయణ, తాళ్లూరి అప్పారావు, సూర్య, కర్లపాలెం మండల అధ్యక్షులు గొట్టిపాటి శ్రీ కృష్ణ, మండల ఉపాధ్యక్షులు చిలకల సురేంద్రబాబు, గంగరాజు, కారిమూరి అంజనేష్, అరమళ్ళ సుజిత్, గోగన ఆదిశేషు, జిడుగు మాధురి జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com