Logo
Date of Publish : 11 July 2023, 11:20 pm
Editor : Sake Naresh

వైసీపీ చెబుతున్న సమగ్ర భూ సర్వే దేని కోసం

          పార్వతిపురం ( జనస్వరం ) :  బలిజిపేట మండలం, గలవిల్లి గ్రామంలో, ఇంతవరకు భూ సర్వే జరగలేదు? అలాగే కొంతమంది రైతులకి పాస్ బుక్ లు అయితే ఉన్నాయి గాని ఆ భూమి ఎక్కడుందో కూడా తెలియదు? ఆ గ్రామంలోని రైతులు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే, ఏ పని చేయాలన్నా స్థానిక వైసీపీ లీడర్ మావిడి శ్రీకాంత్నీ వెళ్లి కలవండి అని చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్? కొంతమంది ప్రభుత్వాధికారులు రైతుల ద్వారా లంచాలు తీసుకున్నారు. కానీ ఇంతవరకు వాళ్ళకి ఏ పని చేయలేదు? ఇదే విషయం మీద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు, స్థానిక రైతులతో ఎమ్మార్వో గారు కలవడం జరిగింది? RTI ఆక్ట్ ప్రకారం, ఆ గ్రామంలో వెంటనే సమగ్ర భూ సర్వే చేయాలి, పాసుబుక్కులోన రైతులకి వెంటనే ఆ భూమి అప్పజెప్పాలి, ఆ గ్రామంలో ప్రభుత్వ భూమి ఎంత ఉంది? ఇనాం భూములు ఎంత ఉన్నాయి? ఈ భూములు ఎవరెవరి దగ్గర ఉన్నాయి మొత్తం వివరాలు చెప్పాలి? ప్రభుత్వ అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించాలి అని చెప్పి, ఎమ్మార్వో గారునీ కోరడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి, వెంటనే స్థానిక విఆర్ఓ గారిని పిలిచి మందలించి, రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యనిర్వాహన అధ్యక్షుడు  బాబు పాలూరి గారు మరియు, పార్వతిపురం నియోజకవర్గ నాయకులు అక్కివరపు మోహన్ రావు గారు, బలిజిపేట మండల అధ్యక్షుడు బొంకురు పోలినాయుడు, తెర్లాం మండల అధ్యక్షుడు మరడాన రవి, బలిజిపేట మండల నాయకులు, పరుచూరి వెంకటరమణ, నారాయణపురం జనార్ధన్ నాయుడు, నారాయణపురం శివ మామిడి మార్కండేయులు గారు, బొబ్బిలి నియోజకవర్గం నాయకులు సీమల సతీష్, కనకాల శ్యామ్ అల్లు రమేష్, పార్వతిపురం జిల్లా నాయకులు, స్వామి నాయుడు గంటేడ, రఘు మండల అప్పలనాయుడు, నారాయణపురం ఆదినారాయణ, మరియు గ్రామస్తులు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com