కాకినాడ రూరల్ ( జనస్వరం ) : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు రాష్ట్ర పీఏసీ సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇన్చార్జి పంతం నానాజీ ఆదేశాల మేరకు వరి పొలాల్లో తడిసిన ధాన్యాన్ని, నీట మునిగిన వరిని పంటను జనసేన నాయకులు పరిశీలించడం జరిగింది. వారు మాట్లాడుతూ కరప మండలంలో మింగ్ జామ్ తుపాను ప్రభావంతో అతలాకుతలమైన రైతాంగం అని అన్నారు. తడిసిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర ఇచ్చి వెంటనే కొనుగోలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఎకరాకు తక్షణ సాయంగా 20 వేల రూపాయలు నష్టపరిహారం అందించాలి అని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే రైతుల ఇబ్బందికి కారణమని అన్నారు. విపత్తు సమయంలో మీనమేషాలు లెక్కించకూడదు. యుద్ధ ప్రాతిపదికన ఉపశమన చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులకు అండగా నిలబడాలన్నారు.