' ఆంధ్ర ప్రదేశ్ ' - భారతదేశ ధాన్య కర్మాగారంగా, అన్నపూర్ణ పేరు గాంచిన రాష్ట్రం. వ్యవసాయమే జీవనంగా కొన్ని వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్న నేల. ఎన్నో జీవనదులు పొంగి పొరలి ఏడాదికి మూడు పంటలు సైతం ఇచ్చే సారవంతమైన నేల ఈ రాష్ట్రానికి సొంతం. వ్యవసాయం అంటే రైతు. కానీ రైతులందరూ వ్యవసాయం సొంత భూమిలోనే వ్యవసాయం చేయరు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 35.7% కౌలు రైతులు ఉన్నారు, దేశంలో రెండవ అత్యధికం కోస్తా జిల్లాల్లోని వరి ఆధిపత్య బెల్ట్‌లో 65-80% వ్యవసాయం కౌలు రైతులే చేస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని దాని వృద్ధిని ప్రభావితం చేసే ప్రధాన సమస్యలలో అద్దెకు సంబంధించిన సమస్య ఒకటి. భూమిని లీజుకు ఇవ్వడం అనధికారిక పద్ధతి అయినా ఎక్కవగా ఇదే కొనసాగుతూ కౌలు రైతులను భూ యజమానుల దోపిడీకి గురి చేస్తుంది. జనాభాలో సగానికి పైగా జీవనోపాధికి ప్రధాన వనరు వ్యవసాయం కోవిడ్-19 వ్యాప్తి తర్వాతి ఆర్థిక పరిణామాల వల్ల వ్యవసాయ సంక్షోభంలో పడింది ఇవి కాక కరువు, వరదల వల్ల రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
ఒక అధ్యయనం ప్రకారం ప్రతి ఏడు వ్యవసాయ కుటుంబాలలో ఒకరు కౌలుదారులు ఉన్నారు మొత్తం వ్యవసాయ కుటుంబాలలో దాదాపు 13.65% ఉన్నారు. 2015-2016లో నిర్వహించిన నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సర్వే (NAFIS) అధ్యయనం ప్రకారం, దాదాపు 52% వ్యవసాయ కుటుంబాలు సగటున రూ. 1 లక్ష కోట్లు రుణ ఉచ్చులో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ వరి, మొక్కజొన్న, రొయ్యల - ఆక్వాలో భారీ ఉత్పత్తిని కలిగి ఉన్న వ్యవసాయ రాష్ట్రం. ఆంధ్ర ప్రదేశ్ సామాజిక - ఆర్థిక సర్వే ప్రకారం ఇందులో 69.27% మంది రైతులు కనీసం రెండు ఎకరాలు కూడా లేని రైతులు ఉండగా.19.31% సగటు అయిదు ఎకరాల పైన భూమిని కలిగి ఉన్నారు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కూడా తీవ్ర స్థాయిలోనే ఉన్నాయి. ఇది 2018లో 664 నుండి 2019 నాటికి 1029కి పెరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం యొక్క "నవ రత్నాలు" సంక్షేమ పథకాలలో ఒకటైన రైతు భరోసా, చిన్న & సన్నకారు రైతులు (5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవారు), కౌలుదారులను లబ్ధిదారులుగా చేర్చారు. వీరిలో ఎక్కువ మంది BC, SC & ST వర్గాలకు చెందినవారు. రూ. 13,500 రైతులకు అందిస్తుండగా, అందులో చిన్న రైతులకు 6000 /- రూపాయలు ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద కేంద్రం భరిస్తుంది. కౌలు రైతుల విషయానికొస్తే, మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే పంపిణీ చేస్తుంది. 2019-2020 సంవత్సరానికి సంబంధించి మూడు విడతల చెల్లింపులు విడుదలయ్యాయి. ఇందులో 46,69,375 మంది రైతులు 1,58,123 మంది కౌలు రైతులు ఉన్నారు.
కానీ AP CCR కార్డ్‌ని పరిచయం చేస్తూ దీనికి ప్రభుత్వం ఒక లెక్క తీసుకుని రాగా, ఆ లెక్కలు రైతు స్వరాజ్య వేదిక ఇచ్చిన లెక్కలకి అసలు పొంతన లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 9.6 శాతం మందికి మాత్రమే పంట సాగు హక్కు కార్డులు అందుతుండగా, మూడు శాతం భూమిలేని కౌలు రైతులకు మాత్రమే రైతు భరోసా పథకం అందడంతో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని రైతు స్వరాజ్య వేదిక నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో 24 లక్షల మంది కౌలు రైతులు ఉండగా వ్యవసాయ శాఖ 16 లక్షల మంది ఉన్నట్లు నివేదిక ఇచ్చింది. RSV కార్యకర్తలు రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో విస్తరించి ఉన్న 4,000 మంది కౌలు రైతులతో రాష్ట్రవ్యాప్త సర్వే నిర్వహించారు. తొమ్మిది జిల్లాలను కవర్ చేస్తూ 2022 జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో ఈ అధ్యయనం జరిగింది. పంట సాగుదారుల హక్కుల చట్టం, 2019 అమలు, రైతు భరోసా, వడ్డీ లేని పంట రుణాలు, విపత్తు పరిహారం మరియు పంట సేకరణతో సహా ప్రభుత్వ పథకాలలో కౌలు రైతులను చేర్చడంపై రాష్ట్ర స్థాయి విశ్లేషణపై నివేదిక దృష్టి సారించింది.
కౌలు రైతులు ఒక్కొక్కరు సగటున దాదాపు రూ.2 లక్షల అప్పులతో తీవ్రంగా అప్పులపాలయ్యారని తేలింది. కొన్ని పంటల్లో ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.1.2 లక్షల వరకు, కోస్తా జిల్లాల్లో 32 బస్తాల వరకు వరి సాగు భారం మోపుతున్నారు. సిసిఆర్‌సి కార్డ్‌ను స్వీకరించడానికి అతిపెద్ద అడ్డంకి ఏమిటంటే, దరఖాస్తుపై సంతకం చేయడానికి యజమానులు నిరాకరించడం మరియు వారిని ఒప్పించడంలో అధికారుల వైఫల్యం. 90 శాతానికి పైగా కౌలు రైతులు గత మూడేళ్లలో కనీసం ఒక్కసారైనా తీవ్రంగా పంట నష్టపోతే కానీ ఒక్క శాతం మాత్రమే ఏదైనా విపత్తు పరిహారం పొందారు. ఇదే కౌలు రైతులను అప్పుల ఊబిలోకి నెట్టడంలో పెద్ద పాత్ర పోషించింది. ఇది ఇలా ఉంటే ప్రభుత్వ తీరుతో తీవ్ర నిరాశకు గురైన కౌలు రైతు కుటుంబాలకు జనసేన ఊపిరి పోసింది అనే చెప్పాలి. కౌలు రైతుల కష్టాలను ప్రభుత్వం పెడ చెవిన పెట్టింది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన ప్రభుత్వ తీరు కౌలు రైతులకు అనుగుణంగా లేకపోవడంతో అప్పులభారం నుండి బయటికి రాలేక మరణించిన 80 కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబానికి లక్షచొప్పున ఆర్థిక సాయం ప్రకటించడమే కాకుండా రాష్ట్రంలోని మొత్తం కౌలు రైతులకు అడంగా ఐదు కోట్ల సహయనిధిని విడుదల చేయడం అభినందించదగిన విషయం. ఇంతటితో ఆగకుండా రైతుల తరుపున పోరాడటానికి జనసేన నడుం బిగించడంతో నిరాశ నిండిన కౌలు రైతుల కుటుంబాలకు ఊరట లభిస్తుంది. ప్రభుత్వం ఒంటి పోకడ నిర్ణయాలు మార్చుకొని , కౌలు రైతుల కష్టాలను పరిగణలోకి తీసుకోవాలని ఆశిద్ధాం.
అన్నదాత సుఖీభవ !!
- టీం నారీస్వరం
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com