` సేకరించడానికి మీరు ఎవరు?
` సేకరించి ఏ ముఠాకు పంపుతున్నారు?
` ఈ రాకెట్ వెనక ఎవరు ఉన్నారు?
` బాలికలకు మహిళలకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేదు
` అధికారులు తక్షణమే విచారించి ఆడపిల్లలకు భద్రత
రక్షణ కల్పించాలి.
` ఆడపిల్లల అదృశ్యం వెనక ఉన్నది కొంతమంది
అధికారులేనా అనే అనుమానం కలుగుతుంది
` సమాచారం సేకరిస్తున్న వ్యక్తులపై పోలీసు శాఖ
తక్షణమే స్పందించి దర్యాప్తు చేయాలి
` రవి భార్గవ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలి
విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతి నిధి, విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన మహేష్ గురువారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడి యా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ విజయవాడ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆశ్రయం పొందు తున్నటువంటి మైనార్టీ తీరని 200మంది బాలికల సమచారాన్ని రవి భార్గవ్ అనే అధికారి ఎందుకు సేకరిస్తున్నారని, అక్కడ ఆశ్ర యం పొందుతున్నటువంటి ఆడపిల్లల సమాచారాన్ని సేకరించి రవి భార్గవ్ ఎవరికి పంపుతున్నారని, దీని వెనకాల ఏ రాకెట్ ఉందో అసలు ఈయన ఆడపిల్లల పేర్లు, ఫోటోలతో కూడిన వివ రాలు ఏ కారణంతో సమాచారాన్ని సేకరిస్తున్నాడో సేకరించిన సమాచారాన్ని ఎవరికి పంపుతున్నారు.. ఎందుకు పంపుతు న్నారో.. పోలీస్ అధికారులు విచారణ చేపట్టి బాలికలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రవి భార్గవ్ అనే అధికారి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో బెంచ్చాఫ్ జడ్జెస్ ఐదుగురు ఉంటారని, అందు లో వీరు కూడా ఒకరిని అసలు మీరెవరు..? ఆడపిల్లల సమా చారాన్ని సేకరించి స్పైరల్ బైండిరగ్ చేయించి పెన్ డ్రైవ్‌లో భద్ర పరిచి తీసుకెళ్లే అధికారం మీకు ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ సేక రించిన సమాచారాన్ని మీరు ఎవరికైనా అమ్ముతున్నారా లేక ఎవరి కైనా పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని రక్షించే అధికారంలో ఉండి వారి సమాచారాన్ని సేకరించి పెన్ డ్రైవ్ లో భద్రపరిచి ఏ ముఠాకి నువ్వు ఇస్తున్నావు నీ వెనుక ఉన్న రాకెట్ ఎవరని దీనికి మీరు సమాధానం చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపిం చారు. దీనిపై నగర పోలీస్ కమిషనర్ విచారణ చేపట్టాలని, మహిళ కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ పనికిమాలిన లెటర్లు రాయడం మానేసి ఈ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటు వంటి దుర్ఘటనల మీద దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రవి భార్గవ్ చేస్తున్నటువంటి చర్యల మీద విచారణ చేపట్టి తక్షణమే కేసు నమోదు చేయాలని కోరారు. కృష్ణానది పరివాహక ప్రాంతం లో సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే ఒక నర్స్ మీద ఆఘా యిత్యం జరిగితే ఏవన్ ముద్దాయిని ఇంతవరకు కూడా పట్టుకో లేకపోయారని, ఈ సంఘ విద్రోహ వ్యక్తుల మీద ఈ మానవ మృగాల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఈ ఘటన మీద సీఎం, డీజీపీ తక్షణమే స్పం దించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం పోలీస్ కమిషనర్‌ను కలిసి పూర్తి వివరాలు ఆయనకి అందజేసి రవి భార్గవ్‌పై, అతనికి ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారులు వివరాలు కూడా అందజేసి చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు .
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com