Logo
Date of Publish : 08 October 2020, 6:56 am
Editor : Sake Naresh

40 రోజులకు రోడ్డు పాడైపోవడం ఏమిటి ? : నర్సిపట్నం జనసేన నాయకులు

40 రోజులకు రోడ్డు పాడైపోవడం ఏమిటి ? : నర్సిపట్నం జనసేన నాయకులు

                              జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజన్న వీర సూర్య చంద్ర ఆరోపించారు.  నర్సీపట్నం నుండి కేడీపేట వైపు వెళ్లే రోడ్డు మార్గం విస్తరణ పనులు ఈ మధ్యనే చేపట్టారు. కానీ, రోడ్డు వేసి 40 రోజులు గడవక ముందే వేసిన రోడ్డు అప్పుడే గుంతలు పడి పోయి ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా రోడ్డు వేయడం ఏమిటి అప్పుడే పోవడం ఏంటి అని ఆ రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఈ సమస్యను మా వద్దకు తీసుకువచ్చారు. మేం వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన వెళ్లి పరిశీలించగా నిజమేనని తేలింది. నర్సీపట్నం నుండి కేడీపేట వెళ్లే రోడ్డు మార్గం రోడ్డు విస్తరణ పనులు చేపట్టి 40 రోజులు పై పడింది. ఒక దగ్గర నుంచి విస్తరణ చేసుకుంటూ కొత్త రోడ్డు వేస్తూ వెళ్తున్నారు కానీ వేసిన రోడ్డు అప్పుడే గుంతలు పడిపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. సంబంధిత అధికారులు వీటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, నాణ్యతా నిర్ధారణ చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారు ?రోడ్డు వేసుకుంటూ వెళితే చివరకు వెళ్లేసరికి ఏ విధమైన నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఈ విధంగా రోడ్డు వేసినట్టయితే చివరకు వెళ్లేసరికి వేసిన రోడ్డు వేసినట్టే గుంతలు పడుకుంటూ వస్తుంది. ఇటువంటి ఉదాసీనత వ్యవహరించే రోడ్డు కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి తదుపరి ప్రజాధనం దుర్వినియోగం పాల్పడుతున్నటువంటి అధికారులపై దానికి సహకరిస్తున్న నాయకులపై విచారణ చేపట్టి రోడ్డు నాణ్యతతో కూడినటువంటి రహదారులు నిర్మించేలా పై స్థాయి అధికారులకు ఫిర్యాదు అందిస్తున్నామని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నర్సీపట్నం రూరల్ అధ్యక్షుడు ఊడి చక్రవర్తి నర్సీపట్నం టౌన్ ప్రధాన కార్యదర్శి కొప్పాక కళ్యాణ్,  నాతవరం మండలం నాయకులు వెంకటరమణ గొలుగొండ మండలం నాయకులు దొరబాబు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com