Logo
Date of Publish : 09 October 2021, 3:40 pm
Editor : Sake Naresh

రైతుల పక్షాన పోరాటం చేస్తే అరెస్టు చేయడం ఏమిటి ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జనసేన నాయకులు అనుకుల రమేష్

    అత్తిలి, (జనస్వరం) : గులాబ్ తుఫాను ప్రభావం వలన కురిసిన భారీ వర్షాల వలన తణుకు నియోజకవర్గంలోని వయ్యేరు కాలువ ఉదృతంగా ప్రవహించటం వలన నీట మునిగిన పంటపొలాలను పరిశీలించేందుకు వచ్చిన జనసేన నాయకులను పోలీసు వారు అరెస్టు చేయడం దారుణమని అనుకూల రమేష్ అన్నారు. రైతుల పక్షాన పోరాడితే అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ  రైతులకు వెన్నుదన్నుగా తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఉంటుందని తెలియపరచటం జరిగింది.  జనసేన పార్టీ తరపున గెలిచిన తిరపతిపురం గ్రామ సర్పంచ్ శ్రీ కాండూరి లీల మణికంఠ గారితో పాటుగా తిరపతిపురం, ఉరదాళ్ళపాలెం, బల్లిపాడు జనసేన నాయకులు కార్యకర్తలు రైతులతో ముంపు ప్రాంతాలలో పర్యటించి వారి తరుపున ప్రభుత్వం పై పోరాడి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కలిగే వరకూ పోరాడతామని తెలియచేశారు. అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన పొట్ట దశ ఉన్న పంట పొలాలు పూర్తిగా మునిగి పోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణ సాయం కింద 25000/- రూ నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ రైతులు తరుపున డిమాండ్ చేయడం జరిగింది. అలాగే వయ్యేరు కాలువ తిరపతిపురం ఆరుదలకోడు కొత్త గేట్లు కాలువ వైపుకు పెట్టాలని, పశువులకు పశుగ్రాసం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరుపతి పురం గ్రామానికి విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు గ్రామ ప్రెసిడెంట్ గారు రైతులు రమేష్ గారు జనసైనికులు అందరూ కలిసి వినతి పత్రం అందజేయడానికి వెళ్లగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. పోలీస్ వారు  అనుకుల రమేష్ గారిని తిరుపతి పురం ప్రెసిడెంట్ గారిని అరెస్టు చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు, జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com