Logo
Date of Publish : 26 November 2021, 3:03 pm
Editor : Sake Naresh

ఒప్పందం చేసుకున్నాక ప్రభుత్వమే రైతుల్ని మోసం చేస్తే ఎలా? సొంత జిల్లాకు కష్టం వస్తే పర్యటించలేని సీఎం ఎందుకు? జనసేన పార్టీ PAC ఛైర్మెన్ శ్రీ నాదెండ్ల మనోహర్

     నెల్లూరు, (జనస్వరం) : అమరావతి రాజధాని రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు మరియు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మెన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మరియు PAC సభ్యులతో నెల్లూరును సందర్శించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు గ్రామంలో అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపి, ఒప్పందం చేసుకున్నాక ప్రభుత్వమే రైతుల్ని మోసం చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. రైతులకు వాగ్దానం ఇచ్చినట్లుగా అమరావతిని రాజధానిగా ప్రభుత్వం చేయవలసిందేని తెలిపారు. అమరావతి రైతులు భావితరాల భవిత కోసం తమ భూములను దానం చేశారని, ముందస్తు ఆలోచన లేని ఈ సీఎం ఇప్పటికీ రాజధాని ఊసే ఎత్తలేదు అని తెలిపారు. రాజధాని రైతులకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఉందని తెలిపారు. అనంతరం స్థానిక హైవే మీద గల జి ఎస్ ఆర్ కళ్యాణమండపం నందు నాయకులు మరియు పార్టీ ప్రతినిధులతో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సీఎం వర్క్ ఫ్రం హోం చేస్తున్నారని తెలిపారు. వరద తాకిడికి ప్రజల అల్లకల్లోలం అవుతుంటే కనీసం సి‌ఎం తమ సొంత జిల్లా అయిన కడప జిల్లాలో కూడా పర్యటించలేదు. రాష్ట్రం సంక్షేమ పట్టించుకోని ఈ సీఎం ఉంటే ఎంత ఊడితే ఎంత అని తెలిపారు. అధికార పార్టీ ప్రతినిధులు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంటే జనసేన నాయకులు మహిళా కార్యకర్తలు మరియు జనసైనికులు వరద బాధితుల కాపాడేందుకు మరియు వారికి అవసరమైన ఆహారం మరియు నిత్యవసరాలు అందించే పనిలో ఉన్నారని, ఇటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఉపయోగపడని ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి అని తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా జీవించాలంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని, జనసేన పార్టీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గతంలో జనసేన పార్టీ నెల్లూరు నగరంలో క్రియాశీలకంగా పని చేసిన సైనికుడు రవిశంకర్ ప్రమాదవశాత్తు మరణించగా అతని కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. అనంతరం వరద ప్రభావిత బాధితులకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గారు మరియు రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, శ్రీమతి గంటా స్వరూప జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ నగర నియోజకవర్గపు నాయకులు కేతంరెడ్డి వినోద్ కుమార్, దుగ్గిశెట్టి సుజయ్ బాబు మరియు జనసేన పార్టీ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు పార్టీ PAC సభ్యులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com