
● వైఎస్ఆర్ పెళ్ళి కానుక ప్రభుత్వ వెబ్ సైట్ లో దుల్హన్ సాయం 50వేల రూపాయలే చూపెడుతోంది
● గతంలో ఎన్నడూ లేనన్ని అడ్డగోలు నిబంధనలు
● ఉర్దూ ట్రాన్స్ లేటర్ పోస్టులను కూడా వదలకుండా వైసీపీ ప్రభుత్వం ముస్లింలకు తీరని ద్రోహం చేస్తోంది
● పవనన్న ప్రజాబాటలో జనసేనపార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 143వ రోజున 49వ డివిజన్ ఈద్గామిట్ట ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ముస్లిం మైనారిటీ సోదరులు ఎక్కువగా నివసిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం వల్ల తమకు కలుగుతున్న ఇబ్బందులను ప్రతి ఇంట్లోనూ వివరిస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు దుల్హన్ పథకానికి 50 వేల రూపాయల నుండి 1 లక్ష రూపాయలు చేసి వైఎస్ఆర్ దుల్హన్ అని పేరు పెడతామని ఆనాడు జగన్ రెడ్డి మాట ఇచ్చారని, కానీ ఎన్నికలు ముగిశాక మాట తప్పి మడమ తిప్పి పథకాన్నే ఎత్తేసారని, తీరా హైకోర్టు మొట్టికాయలు వేస్తే ఈ అక్టోబర్ 1 నుండి పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారని, తీరా ఇప్పుడు చూస్తే ప్రభుత్వ వెబ్ సైట్ లో ఈ పథకానికి కానుక 1 లక్ష రూపాయలు కాకుండా 50 వేల రూపాయలే చూపిస్తోందని, అది కూడా గతంలో ఎప్పుడు లేనన్ని నిబంధనలు ఇప్పుడు పుట్టుకొచ్చాయని, సీఎం జగన్ రెడ్డికి ముస్లింల సంక్షేమం పట్ల చిత్తశుద్ధే లేదని, తామంతా మోసపోయామని పలువురు కేతంరెడ్డి ఎదుట వాపోయారు. ఉర్దూని రెండో అధికారిక భాష చేసిన ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, గ్రామ, వార్డు సచివాలయాల్లో ట్రాన్స్ లేటర్ పోస్టులను ముస్లిం మైనారిటీ సోదరులకు కల్పించాలని కానీ అటువంటి చర్యలే చేపట్టకుండా వైసీపీ ప్రభుత్వం ముస్లింలకు పూర్తిగా ద్రోహం చేస్తోందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే అని, పవనన్న ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలు సమగ్ర అభివృద్ధి సాధించే విధంగా పరిపాలన ఉంటుందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.