చిత్తూరు ( జనస్వరం ) : ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరులో మార్పు చేయడం ద్వారా ఏమి సాధించాలనుకొంటున్నారో రాష్ట్ర పాలకులు సహేతుకమైన వివరణ ఇవ్వాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జి Dr యుగంధర్ పొన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ బదులుగా వైఎస్సార్ అని పెడితే విశ్వ విద్యాలయంలోనూ, రాష్ట్రంలోనూ వైద్య వసతులు మెరుగైపోయాతాయా? అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైద్య వసతులు ప్రమాణాలకు తగ్గ విధంగా లేవు అనేది వాస్తవమని, ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ తగినన్ని పడకలు లేవని, సిబ్బంది అందుబాటులో లేరని ఔషధాలు ఉండవని తెలిపారు. కోవిడ్ సమయంలో మాస్కులు అడిగినందుకే డా.సుధాకర్ గారిని వేధించడంతో.. మానసిక వ్యధకి లోనై మరణించిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదని మండి పడ్డారు. మెరుగుపరచాల్సిన మౌలిక వసతులను వదిలిపెట్టి విశ్వ విద్యాలయం పేరు మార్చడంలో అర్థం లేదని, ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించేందుకు, కొత్త వివాదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఇదని, పాలకులు మారినప్పుడల్లా పేర్లు మార్చుకుంటూ వెళ్తే ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని తెలియ జేశారు. ఈ పాలకులకు యల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు తెలుసా? ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రజ్ఞుల్లో ఒకరైన దివంగత యల్లాప్రగడ సుబ్బారావు గారి పేరయినా ఈ పాలకులకు తెలుసా? వైద్య విశ్వ విద్యాలయానికి ఆ రంగంలోని ప్రముఖుల పేరు పెట్టాలనే చిత్తశుద్ధితో కూడిన ఆలోచన ఉండి ఉంటే యల్లాప్రగడ సుబ్బారావు గారి పేరును పరిగణించేవారని ప్రభుత్వాన్ని ఎండగట్టారు. బోదకాలు, టైఫాయిడ్ లాంటి రోగాలకు మందులు కనుగొని ప్రపంచానికి అందించిన గొప్ప శాస్త్రవేత్త, మన తెలుగు వారైన యల్లాప్రగడ సుబ్బారావు గారి పేరుని కనీసం ఒక్క సంస్థకైనా ఈ పాలకులుపెట్టారా? ఇంట్లోవాళ్ల పేర్లు ప్రజల ఆస్తులకుపెట్టే ముందు, ప్రజల కోసం జీవితాలను ధారపోసిన మహనీయుల గురించి పాలకులు తెలుసుకోవాలని ఈ సందర్బంగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు విజయ్, మండల ప్రధాన కార్యదర్శులు నరేష్, వెంకటేష్, టౌన్ కమిటి అధ్యక్షులు రాజేష్, జిల్లా కార్యక్రమాల కమిటి సభ్యులు బాను చంద్ర రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, టౌన్ కమిటి ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు మని, సూర్య నరసింహులు పాల్గొన్నారు.