మామూలుగా రాత్రి సమయంలో పడుకునేటప్పుడు కొందరు వెలుతురులో పడుకుంటే మరి కొందరు చీకటిలో పడుకుంటూ ఉంటారు. బెడ్ రూమ్ లో లైట్ అలాగే ఆన్ చేసుకొని కొందరు అలాగే నిద్రపోతూ ఉంటారు. అందరికి మాత్రం అలాగే లైట్ వెలుగుతూ ఉంటే నిద్ర పట్టదు. అయితే చీకటిలో నిద్రపోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చుట్టూ వాతావరణం చీకటిగా ఉండడం వల్ల మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల మీరు త్వరగా నిద్రపోతారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. చీకటి అనేది విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది.
మెదడు చాలా సున్నితంగా ఉంటుంది. తక్కువ వెలుతురు అనేది మెలటోనిన్ ఉత్పత్తిని ఆపేస్తుంది. ఇది మీకు నాణ్యమైన నిద్రని అందించడంలో కీ రోల్ పోషిస్తుంది. చీకటి గదిలో పడుకోవడం వల్ల జీవక్రియ మెరుగ్గా మారుతుంది. అంటే మీ బాడీ ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. దీని వల్ల మీరు బరువు కూడా తగ్గుతారు. మరి బరువు తగ్గేందుకు ట్రై చేస్తున్నవారు ఆ విధంగా ప్లాన్ చేయాలి. చీకటిలో నిద్రపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు నిద్ర పోతే ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. మెలటోనిన్ మానవ బాడీలో ముఖ్య హార్మోన్ లలో ఒకటి. ఈ హార్మోన్ రాత్రిపూట పీనియల్ గ్రంథి ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. జీవ గడియారానికి సమయ సంకేతంగా ఇది పనిచేస్తుంది.
నాణ్యమైన నిద్రని అందించడంలో ఇది హెల్ప్ చేస్తుంది. కళ్ళకి చీకటి చాలా ముఖ్యం. ఎందుకంటే, ఇది వాటిని రక్షించేందుకు సాయపడుతుంది. అవి సరిగ్గా రెస్ట్ తీసుకునేలా చేస్తుంది. అందుకే, చీకటి గదిలో పడుకునే వారికి కంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి, రెగ్యులర్గా చీకటి గదిలో పడుకోవడం అలవాటు చేసుకోవడం మంచిది. మీ శరీరం పూర్తి శరీరంలో ఉన్నప్పుడు చర్మం వృద్ధాప్యాన్ని నిరోధించే సెల్యూలర్ పునరుత్పత్తిని మెరుగ్గా చేస్తుంది. దీని వల్ల వృద్ధాప్య లక్షణాలు దూరమవుతాయి.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com