Logo
Date of Publish : 15 May 2022, 4:59 pm
Editor : Sake Naresh

తాడేరు వంతెన నిర్మాణ పనులను పూర్తి చేయాలని పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు ఆధ్వర్యంలో నిరసన

    పశ్చిమగోదావరి, (జనస్వరం) : అసమర్థత పాలనతో జగన్ ప్రభుత్వం నడుస్తుందని, కేసులు పెట్టడంపై ఉన్న దృష్టి అభివృద్ధిపై పెట్టాలని జనసేన జిల్లా అధ్యక్షులు, భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి కోటికలపూడి గోవిందరావు (చినబాబు) విమర్శించారు. స్థానిక తాడేరు రోడ్డులో ఉన్న వంతెనను వెంటనే నిర్మాణం చేపట్టాలని వంతెన వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చినబాబు మాట్లాడుతూ రెండేళ్ళ అయిన ఈ వంతెన నిర్మాణం చేపట్టక పోవడం సిగ్గు చేటని అన్నారు. ఎమ్మెల్యే ఈ పనులలో జాప్యం చేస్తున్నారని, టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలని, ఆయన అసమర్థత వల్లే అభివృద్ధి పనులు అగిపోతున్నాయని అన్నారు. 30 వేల మందికి ప్రధాన రహదారి అయిన తాడేరు వంతెనను నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో PAC సభ్యులు కనకరాజు సూరి, పార్టీ నగర అధ్యక్షుడు చెన్నమల్ల చంద్రశేఖర్, భీమవరం మండల అధ్యక్షులు మోకా శ్రీను, టౌన్ సెక్రెటరీ సుంకర రవి, నాయకులు బండి రమేష్ కుమార్, మాజీ కౌన్సిలర్ వానపల్లి సూరిబాబు, ఉండవల్లి శ్రీను, తిరుమల కృష్ణ, బాలాజీ, అరేటి వాసు, తాతాపూడి రాంబాబు, గంధం పెదబాబు, పాండు రంగరాజు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com