పశ్చిమ గోదావరి ( జనస్వరం ) : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి భారీ ఎత్తున కరెంట్ చార్జీలు పెంచడాన్ని జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఫ్యాన్ గుర్తు చూసి ఓటు వేసిన రాష్ట్ర ప్రజల ఇళ్ళల్లో ఫ్యాన్లు వేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని జనసేన నాయకులు అన్నారు. సామాన్యుడి దగ్గర నుండి మధ్య తరగతి ప్రజల వరకు ఈ పెరిగిన కరెంట్ చార్జీల భారం అధికంగా ఏర్పడిందని జనసేన పార్టీ జిల్లా నాయకులు అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గజనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఒకవైపు ఈ ప్రభుత్వం చెత్తకు, నీటికి, ఇంటికి పన్నులు పెంచింది. మరోవైపు నిత్యావసర వస్తువులకు ధరలు, పెట్రోలు, డీజిల్ ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య ప్రజలు కొనలేని తినలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మూలిగే నక్క మీద తాటిపండు పడిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీలు పెంచింది. ఇలా పన్నుల రూపంలో వసూలు చేస్తూ ప్రజలకు తగిన వసతులు కల్పిస్తున్నారా అంటే అదీ లేదు. జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది.. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు (చినబాబు), ప.గో.అధికార ప్రతినిధి ఏలూరు జనసేన పార్టీఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, నరసావురం ఇంచార్జీ బొమ్మిడి నాయకర్, రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి, ప్రియా సౌజన్య, తాదేపల్లిగూదెం ఇంచార్జీ బొలిశెట్టి శ్రీనివాస్, చింతలపూడి ఇంచార్జీ మేకా ఈశ్వరయ్య, పోలవరం ఇంచార్జీ చిర్రిబాలరాజు, తణుకు ఇంచార్జీ విడివాడ రామచంద్రరావు, . జిల్లా కార్యదర్శి జి.రవి కుమార్,ఉభయగోదావరి జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ కాట్నం విశాలి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, రాష్ట్ర చేనేత వికాస విభాగ కార్యదర్శి దోనేపూడి లోవరాజు, జిల్లా ఉపాధ్యక్షు ఇళ్ళ శ్రీనివాస్, ఉంగుటూరు నాయకులు కట్రెడ్డి చంద్రశేఖర్, దెందులూరు నాయకులు కొఠారు ఆదిశేషు, జిల్లా జాయింట్ సెక్రటరీ సౌజన్య శివశక్తి, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర వైస్ చైర్మన్ మోరు వెంకట నాగరాజు, క్రియాశీల సభ్యులు కనకరాజు సూరి, జెడ్‌పిటిసి గూండా జయప్రకాష్ ఏలూరు నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, వీర మహిళలు కావూరి వాణిశ్రీ, గుదే నాగమణి, లంకా ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.