కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు

          అనంతపురం రూరల్, అక్టోబర్ 14, జనస్వరం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యంత ప్రతిష్టాత్మకంగా  నిర్వహించిన పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా సోమవారం అనంతపురం మండల కేంద్రంలోని  కందుకూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. వర్షం కురుస్తున్న లెక్క చేయక అభివృద్ధి పనులకు స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు శ్రీకారం చుట్టారు. స్థానిక నాయకులు, సర్పంచ్, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో FCI కాలనీలో కొత్తగా నిర్మించే సి‌సి రోడ్డు నిర్మాణానికి టెంకాయ కొట్టి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.4500 కోట్లతో గ్రామాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం బాటలు వేస్తోందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 30వేల పనులకు సుమారు 4500 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు దేశానికి ఆదర్శమని కొనియాడారు. ఒకెరోజు 13,342 పంచాయితీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డ్ నెలకొల్పడం ఒక్క పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానానికి నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కాకుండా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య రాజ్యాన్ని పల్లెల్లో చూస్తామని అన్నారు.  జగన్ పాలనలో  పంచాయతీలను నిర్వీర్యం చేశారని ఎద్దేవా చేశారు. టిడిపి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రగతికి బాటలు వేశారని తెలిపారు.గ్రామంలో రోడ్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం వీధిలైట్లు ఏర్పాటు చేసి పలు అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని వారు వెల్లడించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధికి బీజం పడిందన్నారు. వైసిపి ప్రభుత్వ హయంలో గ్రామాల్లో ఎక్కడా నయా పైసా  అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. ఇక గ్రామాల్లో ప్రగతి పుంజుకుంటుందని అందుకు ప్రజల సహకారం ఎంతో అవసరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ  టిడిపి నాయకులు జింక సూర్య నారాయణ, రాగే మురళి, మండల నాయకులు,  ఎం‌పి‌డి‌ఓ, వివిధ ప్రభుత్వ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, స్థానిక టీడీపీ, జనసేన, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way