ఎమ్మిగనూరు ( జనస్వరం ) : జనసేన - టిడిపి పార్టీల ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే సమావేశాలకు నిర్వహణ సంప్రదింపుల బాధ్యతలను జనసేన పార్టీ ఎమ్మిగనూరు ఇంఛార్జి రేఖగౌడ్ ఎంపికపై గోనెగండ్ల మండల జనసేన నాయకులు గానిగ బాషా, మాలిక్, ఖాసిం వలి, హర్షం వ్యక్తం చేశారు. ఉభయ పక్షాల ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు కార్యక్రమాలకు కార్యకర్తలను సమన్వయ పరిచే బాధ్యతలను అధినేత పవన్ కళ్యాణ్ అప్పగించారని త్వరలోనే అధిష్టానం పిలుపు మేరకు నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో చేసే భవిష్యత్ కార్యాచరణపై జనసేన - టిడిపి పార్టీలు ఉమ్మడిగా ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఉమ్మడి పార్టీల నుంచి పోటీచేసే అభ్యర్ధి గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కోసం సైనికుల్లా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దిలేటి, మల్లి, వెంకటేష్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com