నెల్లూరు ( జనస్వరం ) : లస్కర్లతో పాటు జలవనరుల శాఖకు సంబంధించి చాలా మందికి సరిగా జీతాలు అందడం లేదని.... 22 నెలలుగా జీతాలు ఇవ్వని కారణంగా లస్కర్లు చేస్తున్న దీక్షకు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఈ రోజు కలసి వారికి సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంట గెలవలేనమ్మ రచ్చకెక్కిందంట సొంత జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కాకాని అన్నదాతను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని మొత్తం ఉద్ధరిస్తాను అన్నట్టు తిరగడం హాస్యాస్పదం. జగనన్నకు చెప్పాల్సిన అవసరం లేదు సమస్యలతో అందరూ వీధిన పడే దుస్థితి ఏర్పడింది. తెల్లవారుజామున నుంచి రాత్రి పడుకోబోయే వరకు అన్నదాత గురించి ఆలోచిస్తూ సరైన సమయాలలో నీటిని వృధా కాకుండా పనిలో నిమగ్నమైన లస్కర్లకు 22 నెలలుగా జీతాలు ఇవ్వక పోవడం అమానుషం. ఎన్నికల ముందర ఎన్నో వాగ్దానాలు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కనీసం ఔట్సోర్సింగ్, చిన్నాచితకా ఉద్యోగస్తులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. పార్ట్ టైం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు వీధికి ఎక్కారు. పర్మినెంట్ గా ఉన్న వారికి కూడా మూడు నెలలకు ఒకసారి జీతాలు అందే పరిస్థితి ఇప్పటికే ఈ శాఖ నుంచి కొంతమంది ఉద్యోగులు బ్యాంకు ఈ ఎమ్ ఐ తేదీలు మార్చాలని మా గవర్నమెంట్ జీతాలు సరిగా ఇవ్వడం లేదని తెలిపిన విషయమే సంగతి విధితమే. అవగాహనా లోపంతో ఈ ప్రభుత్వము పనిచేసిన వారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇంతకుముందున్నడు 22 నెలల జీతాలు ఆపడం కనీసం ప్రైవేట్ సంస్థల నుంచే చూడలేదు. ఈరోజు గవర్నమెంట్ శాఖ నుంచి ఎదురుచూడాల్సిన పరిస్థితి. రెండవ కారుకి పంట రెడీ అవుతున్న తరుణంలో వీరి జీతాల నిధులు వెంటనే విడుదల చేయాలి. గతంలో ధాన్యాన్ని గిట్టుబాటు ధర కల్పించలేక అకాల వర్షానికి నష్టాలను నష్టపరిహారం అందించలేకపోయిన మంత్రి కాకాని చర్యల వల్ల జిల్లాలో అన్నదాతల పరిస్థితి కూడా అతలాకుతమవుతుంది. వీరు చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతుగా జనసేన పార్టీ తరఫున నిలుస్తాము. సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారమయ్యే వరకూ తోడుగా నిలుస్తామని తెలిపారు. లస్కర్లు తమ జీతాల కొరకు చేస్తున్న నిరాహార దీక్షకు సంఘీభావం తెలుపుతూ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు చిన్న రాజా, ప్రశాంత్ గౌడ్, మౌనేష్, ప్రసన్న, బన్నీ వర, హేమచంద్ర యాదవ్, అమీన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com