జనసేన పార్టీ బలోపేతానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ సంస్థాగత నిర్మాణానికి నాంది పలకడంతో జిల్లా, మండల కేడర్లు ఊపిరి పోసుకోనున్నాయి. అనంతపురం జిల్లా నుండి ఇద్దరు నేతలకు పవన్ కల్యాణ్ క్రియాశీలక పదవులు అప్పగించడంతో పాటు స్వయంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులుగా టిసి వరుణ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ… ఉత్తర్వులు అందించడంతో అనంత జిల్లా జనసైనికుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. నూతనజన సారథులుగా బాధ్యతలు స్వీకరించిన టిసి వరుణ్, చిలకం మధుసూదన్ రెడ్డిలు జిల్లాకు విచ్చేసిన సందర్భంగా శుక్రవారం స్థానిక రామ్‌నగర్‌లోని రాయల్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సమావే
సానికి పెద్ద సంఖ్యలో జనసైనికులు విచ్చేశారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ నాయకత్వంలో అధికార వైకాపా ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. పవన్ కల్యాణ్ సిద్దాంతాలను, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై రాజీలేని పోరాటాలకు. సిద్దం కావాలని సిఎంఆర్ జనసైనికులకు పిలుపునిచ్చారు. తనపై ప్రగాడ నమ్మకంతో తనకు ఈ బాధ్యతలు అప్పగించిన పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. జనసేన జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా జనసేన. పని చేస్తుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ… ఉద్యమ నిర్మాణానికి శ్రీకారం చుడుతామన్నారు. నియోజకవర్గ, మండల స్థాయి నుండి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. “పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, కమిటీలను కూడా జనసైనికుల హర్షధ్వానాల మధ్య టిసి వరుణ్ ప్రకటించారు. తనపై విశ్వాసంతో తనకు ఈ అవకాశం అప్పగించిన పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు భవాని రవికుమార్ మాట్లాడుతూ… జిల్లాలో మారుమూల ప్రాంతంలో కూడా జనసేన పార్టీ జెండా ఎగురుతోందంటే అందులో టిసి వరుణ్ కృషి ఎంతో ఉందన్నారు. టిసి వరుణ్‌కు తమ సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. చిలకం మధుసూదన్ రెడ్డి 17 సంవత్సరాల వయస్సు ఐక్యత చాటుతున్న జనసేన నాయకులలోనే రాజకియాల్లోకి వచ్చారని… గత రెండున్నర దశాబ్దాల సుధీర్ఘ అనుభవం ఉన్న ఆయనకు జనసేన పార్టీ రాష ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం శుభపరిణామమన్నారు. అనంతరం వివిధ నియోజకవర్గాల నుండి వచ్చిన జనసైనికులు, నాయకులు టిసి వరుణ్, చిలకం మధుసూదన్ రెడ్డికి గజమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పొదిలి బాబురావు, హిందూపురం ఇంచార్జ్ ఆకుల ఉమేష్, రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్, తాడిపత్రి ఇంచార్జ్ గ్రీకాంత్ రెడ్డి, జనసేన లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ జీ. మురళీకృష్ణ, పత్తి చంద్రశేఖర్, గల్లా హర్ష, మెగా ఫ్యాన్స్ రాష కార్యదర్శి ఎవి చలపతి, జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం అనంతరం జనసేన పార్టీ కోసం నిరంతరం న్యూస్ అందిస్తూ, పార్టీ కోసం న్యూస్ సమాచారాన్ని అందిస్తున్న జనసైనికుల మీడియా ” జనస్వరం న్యూస్ ” మొదటి సంవత్సరం పూర్తి అయ్యి రెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది.