విజయనగరం ( జనస్వరం ) : పవన్ కల్యాణ్ సిద్ధాంతాలను, భావజాలాన్ని, ఆయన త్యాగనిరతిని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకుని వెళ్తామని జననేత గురాన అయ్యలు అన్నారు. ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని శనివారం స్థానిక వైఎస్ఆర్ నగర్ కాలనీలో ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి జనసేన కరపత్రాలను పంపిణీ చేశారు. అడుగడుగునా మహిళలు విజయ తిలకం దిద్ది , మంగళ హరతులతో స్వాగతం పలికారు. తోట రమేష్ ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తలు సంఘీబావం తెలియజేశారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ పవన్ కల్యాణ్ వంటి మంచి వ్యక్తికి అండగా వుండి మద్దతు ఇవ్వాలని ప్రజలను చైతన్యవంతులను చేసే దిశగా కృషి చేస్తానని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం జనసేన-టిడిపి కూటమీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జగన్ పాలన ఏమాత్రం బాగోలేదని, ఆయన నొక్కని బటన్ ల సంగతి ఏంటని ప్రశ్నించారు. సిపిఎస్ రద్దు చేస్తానని మాట ఇచ్చిన జగన్ కనీసం జీతాలు ఇవ్వలేక పిఎఫ్ నిధులను దారి మళ్ళిస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి చెప్పే బూటకం మాటలను ప్రజలు వినే పరిస్థితిలో లేరని, త్వరలోనే జగన్ మోహన్ రెడ్డిని గద్దె దింపుతారన్నారు. జగన్ ని విమర్శిస్తుంటే వైసీపీ నేతలు ఫీలవుతున్నారని, పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడు, ప్యాకేజి స్టార్ అన్నప్పుడు ఏమయ్యారని నిలదీశారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుంటే తాను కూడా నోరు అదుపులో పెట్టుకుంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు డి.రామచంద్రరాజు, విసినిగిరి శ్రీనివాసు, కాటం అశ్వని,మాతా గాయిత్రి,పుష్పకుమారి, పితాల లక్ష్మీ, దుప్పాడ జ్యోతి, ఎల్. రవితేజ, పిడుగు సతీష్, అడబాల వేంకటేష్, బాలు,చక్రవర్తి, ఎంటి రాజేష్, ఎమ్ .పవన్ కుమార్, వజ్రపు నవీన్ కుమార్, పృథ్వీ భార్గవ్, లంకాపట్నం కుమార్, అభిలాష్, కె.సాయి, సురేష్ కుమార్, హిమంత్ కుమార్, సాయికుమార్, అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com