Logo
Date of Publish : 31 July 2020, 7:54 am
Editor : Sake Naresh

జనసేన పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్న కోనేటి హరి మీద తగిన చర్యలు తీసుకుంటాం

జనసేన పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్న కోనేటి హరి మీద తగిన చర్యలు తీసుకుంటాం : కడప జనసేన నాయకులు. 

        కడప జిల్లాలో జనసేన పార్టీ పేరు చెప్పుకుంటూ కోనేటి హరి రాయల్ అనే వ్యక్తి జనసేన పార్టీకి తీవ్రమైన నష్టం కలిగించే విధంగా పార్టీ ప్రతిష్టకి భంగం కలిగించేలా వ్యవహరించడమే కాకుండా పార్టీకి నష్టం కలిగించే అనేక కుట్రపూరిత కార్య కలాపాలను చేపట్టాడు. పార్టీలో ఇతను చేస్తున్న కుట్ర వ్యవహారాన్ని పసిగట్టినటువంటి ఇక్కడి నాయకులు సదరు వ్యవహారం మొత్తాన్ని సాక్ష్యాధారాలతో సహా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు పోవడం జరిగింది. ఈ వ్యవహారం పై స్పందించిన పార్టీ అధిష్టానం ఈ కోనేటి హరి రాయల్ కు అధికారికంగా జనసేన పార్టీలో ఏ రకమైనటువంటి పదవి బాధ్యతలు లేవు కాబట్టి, జనసేన పార్టీలో అతను తనకు తానుగా ఉన్నటువంటి సామాన్య కార్యకర్త కాబట్టి అతని గురించి ప్రత్యేకంగా పార్టీ అధిష్టానం స్పందించవలసిన అవసరం లేదంటూనే అతని వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుంది కనుక అతని స్థాయికి తగిన విధంగా స్థానిక పార్టీ కమిటీ వారు అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఈ కోనేటి హరి రాయల్ వ్యవహారంలో గత సంవత్సర కాలంగా అతను చేస్తున్న ఆగడాలు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, సామాజిక మాధ్యమాలలో (ఫేస్ బుక్) హద్దు మీరిన అతని వ్యవహార శైలి అన్నీ కూడా క్రమశిక్షణ కలిగినటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు అందరూ కూడా చాలా సహనంతో ఆలోచించి అతను చేస్తున్న తప్పును సరిదిద్దేందుకు, ఆ తప్పు అతను తిరిగి చేయకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అతడు జనసేనపార్టీ ఇంఛార్జిలను, పార్టీ నాయకులను, జన సైనికులను వారి కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా ఫేస్బుక్ వేదికగా చేసుకొని నీచమైన భాష ప్రయోగిస్తూ దూషించడం మొదలుపెట్టడం జరిగింది. ఈ కోనేటి హరి రాయల్ లాంటి నీతి, నైతికత, విజ్ఞత, సంస్కారం, విశ్వాసం లేని వ్యక్తి ఈ రాష్ట్రం మొత్తం మీద జనసేన పార్టీలో మరొకరు లేరు, రారు అని భావిస్తున్నాము అని కడప జనసేన నాయకులు అన్నారు. ఇకపై ఈ కోనేటి హరి రాయల్ చేస్తున్న దుష్క్రియల కారణంగా పార్టీకి నష్టం కలగకుండా కాపాడుకునేందుకు పార్టీ యొక్క, పార్టీ నాయకుల యొక్క ప్రతిష్టను, గౌరవాన్ని కాపాడుకునేందుకు ఈ కోనేటి హరి రాయల్ గురించి అతని పార్టీ వ్యతిరేక కార్యక్రమల గురించి అధిష్టానం ఇచ్చిన సూచన మేరకు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అతడికి జనసేన పార్టీతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాము. కావున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు, ప్రజలందరూ ఈ విషయాలను గమనించి మెలగాలని కడప జనసేన నాయకులు కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com