Logo
Date of Publish : 15 February 2023, 2:56 pm
Editor : Sake Naresh

పవనన్న ప్రభుత్వంలో స్వర్ణకారుల కుటుంబాలను ఆదుకుంటాం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

          నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 275వ రోజున 47వ డివిజన్ సంతపేటలోని గుప్తా పార్క్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో స్వర్ణకారుల కుటుంబాలు ఎక్కువగా నివసిస్తున్నారని, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ స్వర్ణకారుల సమస్యలు తీరడం లేదని, బంగారు పని చేసుకునే వారికి ఏమి బాధలు ఉంటాయిలే అని భావిస్తున్నారా అని ప్రశ్నించారు. దేశంలో ముంబై మహానగరం తర్వాత ఎక్కువ స్థాయిలో స్వర్ణకార కార్మికులు నివసించే ప్రాంతం మన నెల్లూరు నగరం అని, ఇక్కడ పని చేసే కార్మికుల సమస్యలు తనకు అణువణువునా తెలుసని అన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో రాబోయేది పవనన్న ప్రభుత్వమే అని, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇక్కడి సమస్యలన్నీ తీసుకెళ్ళి స్వర్ణకారుల కుటుంబాలను ఆదుకుంటాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com